వేస‌విలో చ‌ర్మాన్ని ర‌క్షించే గంధం..ఎలా వాడాలంటే?

వేస‌వి కాలం రానే వ‌చ్చింది.రోజులు గ‌డుస్తున్నా కొద్ది ఎండ‌లు మండిపోతున్నాయి.

ఎండ‌ల దెబ్బ‌కు ప్ర‌జలు బ‌య‌ట కాలు పెట్టేందుకే బెంబేలెత్తిపోతున్నారు.

ఇక ఈ వేస‌వి కాలంలో ఆరోగ్య స‌మ‌స్య‌లే కాదు అనేక చ‌ర్మ స‌మ‌స్య‌లూ ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.

అందుకే ఆరోగ్యంతో పాటు చ‌ర్మాన్ని కూడా ఎంతో జాగ్ర‌త్త‌గా ర‌క్షించుకోవాల‌ని నిపుణులు చెబుతుంటారు.అయితే వేస‌వి కాలంలో ఎలాంటి స‌మస్య‌ల‌నైనా దూరం చేసి చ‌ర్మాన్ని రక్షించ‌డంలో గంధం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి గంధాన్ని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు చూసేయండి.సాధార‌ణంగా వేస‌విలో త‌ర‌చూ ఇబ్బంది పెట్టే స‌మ‌స్య‌ల్లో స‌న్ ట్యాన్ ఒక‌టి.

Advertisement

కాసేపు ఎండ‌లో తిరిగితే చాలు చ‌ర్మం ట్యాన్ అయిపోతుంది.అయితే అలాంటప్పుడు గంధం పొడి, గులాబీ రేక‌ల పొడి మ‌రియు పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ట్యాన్ అయిన ప్రాంతంలో అప్లై చేసి డ్రై అయిన త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే.

చ‌ర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.

అలాగే స‌మ్మ‌ర్‌లో అధిక ఉష్ణోగ్ర‌త‌ల కార‌ణంగా చ‌ర్మం పేలిపోయి మంట ప‌డుతూ ఉంటుంది.అలాంట‌ప్పుడు గంధం పొడి, కొబ్బ‌రి నీరు వేసి బాగా క‌లిపి చ‌ర్మానికి అప్లై చేయాలి.ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు ఆర‌నిచ్చి ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే చ‌ర్మం మ‌ళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుంది.

Advertisement

ఇక ఎండ‌ల కార‌ణంగా చ‌ర్మ కాంతి త‌గ్గుతూ ఉంటుంది.అయితే గంధం పొడి, తేనె మ‌రియు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూత‌లా వేసుకుని.

అర గంట పాటు వ‌దిలేయాలి.అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే చ‌ర్మం మృదువుగా, య‌వ్వ‌నంగా మ‌రియు ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

తాజా వార్తలు