వేములవాడ: ఇసుక ట్రాక్టర్ ఢీ.. అక్కడికక్కడే మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండల కేంద్రంలో ఇసుక ట్రాక్టర్ ఢీకొని లాలపల్లికి చెందిన తేలు కనకయ్య (45) మృతి చెందాడు.స్థానికుల కథనం ప్రకారం.

చెక్కపల్లి నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్ బైక్ పై వెళ్తున్న కనకయ్యను ఢీకొంది.దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

కనకయ్యకు ముగ్గురు కూతుర్లు, కొడుకు ఉన్నట్లు బంధువులు తెలిపారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News