శాకుంతలం సినిమా వాయిదాకు సమంతకు ఏమైనా సంబంధం ఉందా?

సమంత శాకుంతలం సినిమా ఈ 17వ తారీకు ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కానీ కొన్ని కారణాల వల్ల సినిమాలు వాయిదా వేస్తున్నట్లుగా చిత్ర సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

దిల్ రాజు ఈ సినిమా యొక్క విడుదల తేదీ ని పక్కాగా ప్లాన్ చేస్తునట్లు కూడా సమాచారం అందుతుంది.దర్శక నిర్మాత గుణశేఖర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విషయం లో ఇంకా ఆలస్యం చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

ఈ సమయం లోనే సమంత వల్లే ఈ సినిమా యొక్క విడుదల తేదీ వాయిదా వేశారని ప్రచారం జరుగుతుంది.అసలు విషయం ఏంటంటే సినిమా విడుదల ఆలస్యం కు పోస్ట్ ప్రొడక్షన్ వరకు బ్యాలెన్స్ ఉండడం కారణమని తెలుస్తుంది.

సమంత అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఓకే చెప్పిందట, ఆయన కూడా గుణశేఖర్ సినిమా యొక్క విడుదల విషయంలో కాస్త వెనకంజ వేశాడు అని తెలుస్తోంది.

Advertisement

అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమా లో చూపించాలనే ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నాడని సమాచారం అందుతుంది.అన్ని వర్గాల ప్రేక్షకులను సమంత అభిమానులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందట.కేవలం తెలుగు లోనే కాకుండా సౌత్ లోని అన్ని భాషల్లో మరియు హిందీ లో కూడా ఈ సినిమా ను భారీ ఎత్తున విడుదల చేయాలని తీవ్రం గా ప్రయత్నాలు చేస్తున్నారు.

అందుకోసం కాస్త ఎక్కువగా సమయం తీసుకోవాల్సి ఉంటుంది.మరో వైపు సమంత అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగి పోయినట్లుగానే కనిపిస్తుంది.ఆమె ఇతర సినిమా లతో బిజీ గా ఉంది హిందీ లో వరుసగా సినిమా లకు కమిట్ అవుతుంది.

ఎప్పుడు ఈ సినిమా విడుదల అయితే అప్పుడు వచ్చి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు