సాగర్ వివాదం..ఏపీ పోలీసులపై కేసు..!

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి వివాదం మరింత ముదురుతోంది.ఈ క్రమంలో ఏపీ పోలీసులపై తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ బలగాలు కేసు నమోదు చేశాయి.

ఈ మేరకు నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.ఇందులో ఏపీ పోలీస్ ఫోర్స్ ను ఏ1గా తెలంగాణ పోలీసులు చేర్చారు.

Sagar Dispute..case Against AP Police..!-సాగర్ వివాదం..ఏ

తెలంగాణ భూభాగంలోకి దౌర్జన్యంగా చొచ్చుకువచ్చారని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ ఫిర్యాదులో పేర్కొంది.సుమారు ఐదు వందల మంది సాయుధ బలగాలతో సాగర్ డ్యామ్ పైకి ఏపీ పోలీసులు వచ్చారని, ప్రధాన డ్యామ్ లోని 13 నుంచి 26 గేట్ల వరకూ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారని తెలంగాణ పోలీసులు ఆరోపించారు.

కృష్ణా బోర్డు నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నీటిని వదిలారని ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో సెక్షన్ 447, సెక్షన్ 427 కింద కేసు నమోదు చేశారు.

Advertisement
అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

తాజా వార్తలు