భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఇవే..!

దాదాపు చాలామంది హిందువులు( Hindus ) భగవంతుని పూజిస్తూ ఉంటారు.

ముఖ్యంగా ఇంట్లో ఎంతోమంది దేవుళ్ళ చిత్రాలను, విగ్రహాలను పెట్టుకుని ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు.

ఆయా దేవుళ్ళకు ఇష్టమైన రోజులలో ప్రత్యేకంగా భక్తిశ్రద్ధలతో భోజనం చేయడంతో పాటు దేవుళ్ళకు ఇష్టమైన నైవేద్యాలను కూడా సమర్పిస్తూ ఉంటారు.ఈ విధంగా చేయడం వల్ల భగవంతుడు కోరిన కోరికలు నెరవేరుస్తాడని ప్రజలు నమ్ముతారు.

అయితే మన అందరి ఇళ్ళలోనూ పూజ గది ఒకే రకంగా ఉండదు.సంప్రదాయాన్ని బట్టి, సాంస్కృతిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, దైవాన్ని బట్టి పూజ విధానాలు మారుతూ ఉంటాయి.

Rules To Be Followed While Offering Prasadam To God,god,naivedyam,prasadam Rules

అలాగే దేవుళ్లకు రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా( Prasadam Naivedyam ) సమర్పిస్తుంటారు.ప్రతి దేవతకు ఒక ప్రత్యేక పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అయితే ఏ దేవునికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Rules To Be Followed While Offering Prasadam To God,God,Naivedyam,Prasadam Rules

ముఖ్యంగా చెప్పాలంటే పాయసం విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన ప్రసాదంగా పండితులు చెబుతున్నారు.కాబట్టి ఆయనకు పాయసాన్ని సమర్పించాలి.

అలాగే లక్ష్మీదేవి( Lakshmi Devi )కి పాయసం అంటే ఎంతో ఇష్టం.లక్ష్మీ పూజలో కూడా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు.

Rules To Be Followed While Offering Prasadam To God,god,naivedyam,prasadam Rules

అలాగే పంచామృతాలు( Panchamrutham ) శివుడికి అత్యంత ఇష్టమైనవి.విటీతో పాటు మిఠాయిలు కూడా మహా శివుడికి ఎంతో ఇష్టం.అలాగే పార్వతికి పాయసం ఇష్టమైన పదార్థంగా పండితులు చెబుతున్నారు.

భగవంతునికి సమర్పించే నైవేద్యం కచ్చితంగా స్వాతిక ఆహారమై ఉండాలి.అలాగే పూజకు ఉపక్రమించే ముందు వ్యక్తిగత శుభ్రత కూడా ఎంతో ముఖ్యం.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
Victory Venkatesh : హీరోయిన్లతో గొడవ పడుతున్న స్టార్ హీరో....మాటలు కూడా లేవట?

భగవంతునికి నైవేద్యం తయారు చేయడానికి ముందు ఖచ్చితంగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులను ధరించాలి.పాడైపోయిన పదార్థాలు పొరపాటున కూడా భగవంతునికి సమర్పించకూడదని పండితులు చెబుతున్నారు.

Advertisement

అలాగే భగవంతుడికి సమర్పించే నైవేద్యాన్ని ఎట్టి పరిస్థితులలోనూ రుచి చూడకూడదు.భగవంతునికి సమర్పించే ప్రసాదాన్ని తప్పనిసరిగా ముందుగా తీసి ఉంచాలి.

భగవంతుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత మిగతా భక్తులకు ప్రసాదం పంచాలి.

తాజా వార్తలు