RRR Japan Collections: ఆర్‌ఆర్‌ఆర్‌ : జపాన్ లో డే 1 కంటే డే 21 ఎక్కువ

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌ సినిమా తాజాగా జపాన్ లో విడుదలైన విషయం తెలిసిందే జపాన్‌ లో సినిమా ను ప్రమోట్ చేయడం కోసం హీరోలు ఇద్దరు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో పాటు దర్శకుడు రాజమౌళి కూడా జపాన్ కుటుంబ సమేతంగా వెళ్లారు.

అక్కడ నాలుగు ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.

ఆ తర్వాత సినిమా విడుదల సందర్భంగా కూడా అక్కడే ఉన్నారు.సినిమా విడుదలైన తర్వాత వస్తున్న కలెక్షన్స్ గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతుంది.

జపాన్ లో అంత భారీ ఎత్తున ప్రచారం చేసి విడుదల చేసినా కూడా ఫలితం లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.కానీ తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా మొదటి రోజు కంటే 21వ రోజు ఎక్కువ కలెక్షన్స్ నమోదు చేసిందట.

ఈ స్థాయిలో సినిమా అక్కడ కలెక్షన్స్ నమోదు చేస్తుంది.కనుక అక్కడ సూపర్ హిట్ అన్నట్లుగానే భావించాల్సి ఉంటుంది.

Advertisement

రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా.రాం చరణ్ అల్లూరి సీతారామ రాజు గా నటించారు.ఆలియా భట్ సీత పాత్ర లో కనిపించింది.

అజయ్ దేవగన్ మరియు శ్రియ శరణ్ కీలక పాత్ర లో నటించారు.

హీరోయిన్ గా నటించిన అలియా భట్ కి ఎక్కువ ప్రాముఖ్యత లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.జపాన్ గా విడుదలైన భారీ సినిమా అవడం తో పెద్ద ఎత్తున కలెక్షన్స్ నమోదు అవుతాయని అంతా భావించారు.కానీ సినిమా విడుదల విషయం లో ఉన్నప్పటి కంటే ఇప్పుడు అంతా అంచనాలు లేవని కొందరు భావించారు.

కానీ రోజులు గడుస్తున్నా కొద్ది సినిమా కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి.ఎట్టకేలకు సినిమా భారీ వసూలను నమోదు చేసిందంటూ చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు