కన్నీరు పెట్టిస్తున్న ఓ రైతు ఆవేదన కథనానికి స్పందించిన రాయల్ ఇవి

సూర్యాపేట జిల్లా: జిల్లాలోని యర్కారం గ్రామం దుబ్బతండాకు చెందిన ధారావత్ నరసింహ 5 ఎకరాల వరి పంట సాగు చేసి,నీరు లేక మొత్తం ఎండిపోవడంతో తెచ్చిన పెట్టుబడి అప్పు తీర్చే మార్గం లేక పంట పొలంలో పడుకొని పెట్టిన కన్నీటి వేదన సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నల్లగొండకు చెందిన రాయల్ ఇవి కంపెనీ ఫౌండర్ విశ్వనాథం కారి శుక్రవారం స్పందించారు.తన బ్రాంచ్ ప్రతినిధులతో ఆ రైతును పిలిపించి,నల్గొండలో నూతనంగా ప్రారంభమైన రాయల్ ఇవి కంపెనీ ఎలక్ట్రానిక్ స్కూటీ బ్రాంచ్ ఓపెనింగ్ సందర్భంగా రైతు ధారావత్ నరసింహకు రూ.

30 వేల చెక్కును అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,గుమ్మల మోహన్ రెడ్డి,జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ప్రొప్రైటర్ జయకృష్ణ, చనగోని నగేష్ గౌడ్, అయితగోని రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రైతులు అధైర్య పడొద్దు తడిసిన ప్రతి గింజ కొనుగోలు చేస్తాం : కలెక్టర్ ఎస్.వెంకట్రావ్

Latest Suryapet News