భక్త ప్రహ్లాద ( Bhakta Prahlada )సినిమాలో ప్రహ్లాదుడి పాత్రను అద్భుతంగా పోషించి తెలుగువారి మనసులను దోచేసింది రోజా రమణి( Roja Ramani ).ఈ ముద్దుగుమ్మ తెలుగు భాషలోనే కాకుండా మలయాళం, తమిళం, కన్నడ వంటి ఇతర ప్రాంతీయ భాషా సినిమాల్లో కూడా యాక్ట్ చేసి మెప్పించింది.1970-80 కాలంలో హీరోయిన్‌గా కూడా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.ఈమె కుమారుడు తరుణ్ ( Tarun )టాలీవుడ్ స్టార్ హీరో అన్న సంగతి తెలిసిందే.
అయితే రోజా రమణి ఎవరూ ధైర్యం చేయని కొన్ని పాత్రల్లో కూడా నటించే ఆకట్టుకుంది.
ఒక మలయాళం సినిమాలో ఆమె చిరిగిన పంచె, చిరిగిన జాకెట్ ఇచ్చారట.కన్నె వయసు తెలుగు రీమేక్ అది.అయితే మొదట ఆమె ఆ బట్టలు చూసి చాలా షాక్ అయిందట.ఆ తర్వాత ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయి ఆ మూవీ మొత్తం చేశానని తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.“టైలర్ ఆ బట్టలను ఒక పేపర్లో చుట్టుకుని వచ్చాడు.అవి మామూలు బట్టలు.అవే నేను ధరించాల్సి వచ్చింది. హీరోయిన్ కోసం ఇలాంటి డ్రెస్ తీసుకొస్తారా అనిపించింది.అయిష్టంగానే దాన్ని ధరించాను.
తర్వాత పాత్రలో ఇన్వాల్వ్ అయ్యి మంచిగా నటించాను.ఆ సినిమా బాగా హిట్ అయింది.తర్వాత నాకు 30 మలయాళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.” అని రోజా రమణి చెప్పుకొచ్చింది.
ఈ మాటలకు సంబంధించిన ఒక వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అది చూసి చాలామంది ఆమె డెడికేషన్‌కు టేక్ ఏ బో అంటున్నారు.రోజా రమణి 1985 వరకు మలయాళం సినిమాల్లో నటించింది.1982 వరకు తమిళ ఇండస్ట్రీలో పనిచేసింది.తెలుగులో 1991 వరకు యాక్ట్ చేసింది ఆమె తెలుగులో చివరిసారిగా నటించిన సినిమా పేరు అసెంబ్లీ రౌడీ.అందులో ఆమె ఒక న్యూస్ లీడర్ గా కనిపించింది.
ఆమె సినిమాల్లో కొనసాగినంత కాలం మంచి పాత్రలు వేస్తూ చాలానే ఆకట్టుకుంది.రోజా రమణికి తరుణ్ కాకుండా ఇంకొక అమ్మాయి ఉంది.
ఆమె సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది.ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్ గా పని చేస్తోంది.