రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి.. - ప్రజావాణి లో కలెక్టర్ కు వినతి..

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి మండలంలోని ప్రధాన రహదారిని వెంటనే నిర్మాణం చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anuragjayanthi ) కి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివైడర్ వేసి మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి రోడ్డు వెడల్పు పనులు చేయకపోవడంతో రోడ్డు గుంతలు పడి ప్రజలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నరని అన్నారు.

అధికారులు స్పందించి రోడ్లు మరమ్మతులు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి చేలుకల తిరుపతి,పల్లి గంగాధర్, పిడుగులచ్చిరెడ్డి,పరందాములు,దిలీప్,మనిసాయి తదితరులు పాల్గొన్నారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

Latest Rajanna Sircilla News