ఎన్నికల ఫిర్యాదుల పై తక్షణమే స్పందించాలి.. కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల ఫిర్యాదుల పై వేగంగా స్పందించాలనీ కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి అన్నారు.

శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం గ్రౌండ్ ఫ్లోర్ లో 24 గంటలు పని చేసే సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ, మీడియా సెంటర్ లను కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లు తనిఖీ చేసి సి - విజిల్, కంట్రోల్ రూం, 1950, సోషల్ మీడియా ఫిర్యాదుల నమోదును పరిశీలించారు.

జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు నిస్వాక్షపాతంగా స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో జరగడంలో సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం, ఎంసిఎంసీ , మీడియా సెంటర్ కీలక పాత్ర అన్నారు.ఎన్నికలలలో ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా.

మీడియా లో ఫేక్ న్యూస్ ప్రసారమైన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సమీకృత జిల్లా ఫిర్యాదుల కేంద్రం బాధ్యులు మహమ్మద్ రఫీ, మీడియా సెంటర్ బాధ్యులు, డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం, తదితరులు పాల్గొన్నారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?
Advertisement

Latest Rajanna Sircilla News