సాధారణ క్రైమ్, సైబర్ క్రైమ్ తో వణికిపోతున్న నేరేడుచర్ల

సూర్యాపేట జిల్లా: గత కొంత కాలంగా సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల పట్టణమే టార్గెట్ గా సాధారణ,సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.గత కొద్ది రోజుల క్రితం ఓ పెట్రోల్ బంక్ యజమానికి ఏఎస్ఐ పేరుతో ఫోన్ చేసి మా ఎస్సై కూతురికి ఆరోగ్యం బాగాలేదని రూ.

75 నగదు పంపిస్తున్న ఫోన్ పే ద్వారా పంపించు అంటూ రూ.75 వేలు కాజేసిన ఘటన మరవక ముందే శనివారం పట్టణ కేంద్రంలో మరో సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది.ఆటో మొబైల్ వ్యాపారి రాగిరెడ్డి గోపాల్ రెడ్డికి జియో కస్టమర్ కేర్ నుండి అంటూ వీడియో కాల్ చేసి అతని మొబైల్ హ్యక్ చేసి,పాస్వర్డ్ ని తెలుసుకొని వ్యాపార అకౌంట్ నుండి రూ.1.50 లక్షలు,పర్సనల్ అకౌంట్ నుండి రూ.20 మొత్తం రూ.1,70,000 కొట్టేశాడు.నగదు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇది సైబర్ క్రైమ్ అని టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయమని సూచించారు.ఈ ఘటనతో ఇటీవల నేరేడుచర్ల పట్టణంలో ఐదుగురు వ్యాపారస్తుల ఖాతాల నుండి సుమారు రూ.5 లక్షలు సైబర్ నెరగాళ్లు కొట్టేసినట్లు తెలుస్తోంది.సైబర్ నేరగాళ్ల మోసాలు ఒకవైపు ఆందోళనకు గురి చేస్తుంటే మరోవైపు దోపిడీ దొంగల పనితనం తక్కువేం కాదు.

తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి,పట్టపగలే ఇళ్లలో చొరబడి భీభత్సం సృష్టిస్తున్నారు.సరిగ్గా మూడు రోజుల క్రితం నేరేడుచర్ల పట్టణంలోని సాయిబాబా గుడి వద్ద తాళం వేసిన ఇంటికి పట్టపగలే నేరుగా వెళ్లి,పెళ్లి కార్డు ఇచ్చేందుకు వచ్చాం, ఇల్లు గల వాళ్ళు ఎక్కడికి వెళ్లారని పక్కింటి వారిని అడిగారు.

వాళ్ళు నిజమే అనుకొని ఇంట్లో ఎవరూ లేరు,వచ్చేవరకు సాయంత్రం అవుతుందని చెప్పడంతో పక్కింటి వారిని మరిపించి ఇంట్లోకి దూరారు.ఈ క్రమంలో ఇంటి యజమాని సడన్ గా రావడంతో దొంగతనానికి వచ్చినోడే ఇంటి ఓనర్ ను ఎవరు మీరు అని అడగడం ఆశ్చర్యానికి గురి చేసింది.

Advertisement

వెంటనే తేరుకున్న ఇంటి యజమాని పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోతుండగా సినిమా ఛేజింగ్ తరహాలో వెంటపడిన ఒకడిని పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ది చేశాడు.అయితే రెండు తులాల బంగారం, రూ.80 వేల నగదుతో మరో ఇద్దరు దొంగలు పారిపోయారని చెబుతున్నారు.ఈ కేసుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా నేరేడుచర్లో జరుగుతున్న వరుస ఘటనలు నేరేడుచర్ల పోలీసులకు సవాల్ గా మారాయని అంటున్నారు.

Advertisement

Latest Suryapet News