బోధన సిబ్బంది నియమకాల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి: కలెక్టర్

సూర్యాపేట జిల్లా: బోధన సిబ్బంది నియమకాల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.

మంగళవారం సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా గల బోధన సిబ్బందిని కాంట్రాక్టు పద్దతిన నియమించేందుకు జరుగుతున్న ఇంటర్యూలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో 3 ప్రొపెసర్ పోస్ట్ లు, 9 అసోసియేట్ ప్రొపెసర్ పోస్ట్ లు,48 అసిస్టెంట్ ప్రొపెసర్ పోస్ట్ లు,23 సీనియర్ రెసిడెంట్ పోస్ట్ లు,15 మంది ట్యూటర్ల నియమాకం కాంట్రాక్టు పద్దతిలో నియమించుటకు ఇంటర్యూలు జరుగుతున్నాయని, బోధన సిబ్బంది నియమాక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.తదుపరి ఎంబిబిఎస్ 3 వ సవంత్సర లెక్చరర్ హాల్ ని అలాగే కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు.

Recruitment Process Of Teaching Staff Should Be Transparent Collector, Recruitme

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జయలత, సూపరిటీడెంట్ డాక్టర్ శ్రీకాంత్,డాక్టర్ గురురాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కూరగాయల కొనుగోలులో సామాన్యుడికి తప్పని తిప్పలు
Advertisement

Latest Suryapet News