నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేందాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోట చలం అధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆసుపత్రిలోని పలు రికార్డులను పరిశీలించారు.

అనంతరం డాక్టర్ కోట చలం మాట్లాడుతూ.ప్రభుత్వ హాస్పిటల్లో కాన్పులు ఎక్కువగా జరిగేలా చూడాలని,ప్రజలందరికీ అన్నిరకాల వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

ఎన్.సి.డి,టీబి మరియు అన్ని ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ నాగిని,డాక్టర్ సౌమ్యశ్రీ, సిహెచ్ఓ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ త్రినాధ్,సూపర్వైజర్లు శ్యాంసుందర్ రెడ్డి, జయమ్మ మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

భర్తను చంపిన భార్య... 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు...!
Advertisement

Latest Suryapet News