అన్నాత్తేలో ఊర మాస్ రజిని.. ఆన్ లొకేషన్ పిక్ లీక్..!

సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా శివ డైరక్షన్ లో వస్తున్న సినిమా అన్నాత్తె.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.

 Rajinikanth Annatthe On Shooting Location Pic Leaked, Annatthe, Leaked, Rajini-TeluguStop.com

సినిమా నుండి రజిని మాస్ లుక్ ఒకటి లీక్ అయ్యింది.డైరక్టర్ శివ సీన్ వివరిస్తున్న టైం లో రజిని తన పాత్ర వేష ధారణలో ఉన్నారు.

లీకైన పిక్ లో రజిని లుక్ అదిరిపోయింది.మాస్ లుక్ తో రజిని మరోసారి తన ఫ్యాన్స్ ను అలరించడానికి రెడీ అన్నట్టు ఉంది.

సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధిమారన్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో కీర్తి సురేష్, నయనతార, మీన వంటి స్టార్స్ నటిస్తున్నారు.అన్నాత్తె సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

రజిని సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర గొప్ప ఫలితాలు అందుకోవట్లేదు.అందుకే అన్నాత్తె విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తుంది.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో వరుస సూపర్ హిట్లు తీసుకుంటూ వస్తున్న శివ మొదటిసారి సూపర్ స్టార్ రజినిని డైరెక్ట్ చేస్తున్న ఈ అన్నాత్తె అంచనాలకు మించి ఉంటుందని చెబుతున్నారు.అది ఎంతవరకు వాస్తవం అన్నది సినిమా వస్తేనే కాని చెప్పగలం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube