అప్పుడు ఒకే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్స్.. ఇప్పుడు హీరో అండ్ విలన్

సినిమా అంటేనే విచిత్రం.ఎప్పుడు ఎవరిని ఎటు తీసుకెళ్తుందో చెప్పడం కష్టం.

కొంత మంది అనామకులుగా వచ్చి స్టార్ హీరోలు అయిన వారు ఉన్నారు.బీభత్సమైన సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి ఫ్లాప్ అయిన వారు ఉన్నారు.

విలన్లుగా నటించి హీరోలు అయిన వారు ఉన్నారు.హీరోలుగా సత్తా చాటి విలన్ క్యారెక్టర్లు చేస్తున్న వారూ ఉన్నారు.

అలాగే ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్ రాశీ విషయంలోనూ అలాగే జరిగింది.ఇంతకీ తను ఏం చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది రాశీ.ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగి మళ్లీ మహేష్ బాబు సినిమాలోనే విలన్ రోల్ పోషించింది.

నిజానికి మహేష్ బాబు, రాశీ ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్టులుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.మహేష్ తండ్రి క్రిష్ణ అప్పటికే మంచి ఫామ్ ఉన్నాడు.తన తండ్రి సినిమాల్లోనూ ఆయన చైల్ ఆర్టిస్టుగా చేశాడు.1989లో తెరకెక్కిన క్రిష్ణ మూవీ గూఢ‌చారి 117లో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు.అదే సినిమాలో రాశీ బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాలో వారిద్దరి మధ్య ఎలాంటి సీన్లు ఉండవు.అనంతరం ఇద్దరూ పెద్దవారు అయ్యారు.

మహేష్ బాబు హీరో కాగా.రాశీ హీరోయిన్ అయ్యింది.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్... ఈ హీరో గ్రేట్!
ఎన్టీఆర్ యాక్షన్ షురూ చేసేది అప్పుడేనట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

నెమ్మదిగా మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగాడు.వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నాడు.అప్పుడే మహేష్ నిజం సినిమా చేశాడు.

Advertisement

ఇందులో రాశీ విలన్ రోల్ పోషించింది.ఇందులో గోపీచంద్ మెయిన్ విలన్ కాగా.

రాశీ రెండో విలన్ గా నటించింది.అంటే గోపీచంద్ భార్యగా రాశీ యాక్ట్ చేసింది.

అప్పటికే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె విలన్ గా కనిపించడం పట్ల చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు.కానీ నటులు అన్నాక ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయాలి అనే ధోరణిలో ఆమెను అర్థం చేసుకున్నారు.

తాజా వార్తలు