రేటు పెంచిన పృథ్విరాజ్

ఎవరి టైమ్ ఎప్పుడు ఎటువైపు తిరుగుతుందో.ఇవాల్టి హీరో, రేపు జీరో.

ఇలా రాత్రికి రాత్రే తలరాతలు మారిపోవడం సినిమా ఇండస్ట్రీలో జరిగినట్టుగా ఇంకేక్కడ జరగదు.

ఈ శుక్రవారం ఒకడు స్టార్ అవుతాడు.

వచ్చే శుక్రవారానికి ఒకడు కనుమరుగవుతాడు.అందుకే అంటారు ప్రతి శుక్రవారానికి మారే బ్రతుకులే సినిమా బ్రతుకులు అని.1992 లో ఆ ఒక్కటి అడక్కులో మొదటిసారి నటించాడు కామేడియన్ పృథ్విరాజ్.సినిమా విడుదలై 23 ఏళ్ళు గడిచాయి.

మరి మనకి పృథ్వి ఇంతగా ఎప్పటినుంచి తెలుసు అంటే గత కొన్నేళ్లుగా అనే చెప్పాలి.వందల సినిమాలు, అయినా తగిన గుర్తింపు లేదు.

Advertisement

అటు పూర్తిగా కామేడియన్ కాదు, ఇటు పూర్తిగా క్యారెక్టర్ ఆర్టిస్టు కాదు.కాని టాలెంట్ ఎప్పటికి అలానే దాగుండిపోదు.

కృష్ణవంశి ఖడ్గంలో చేసింది చిన్న పాత్రే.కాని ఇన్ని సంవత్సరాల తరువాత కూడా మనం " 30 ఇయర్స్ ఇండస్ట్రీ" డైలాగుని మరచిపోలేకపోతున్నాం.

అప్పుడు కృష్ణవంశి, ఇప్పుడు కోన వెంకట్, పృథ్విరాజ్ తో ఎంత కామేడి పండిచవచ్చో తీసి చూపించారు.లౌక్యం లో చేసిన " బాయిలింగ్ స్టార్ బబ్లు " పాత్ర పృథ్వి కేరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది.

ఇప్పడు దాదాపుగా ప్రతి సినిమాలో పృథ్విరాజ్ ఉండాల్సిందే.బ్రహ్మనందం ని చూసి నవ్వడం మరచిపోతున్న జనాలు పృథ్విరాజ్ ని చూడగానే పడి పడి నవ్వుతున్నారు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
అవును మేము చెత్త సినిమాలు తీసాం అంటున్న స్టార్ హీరోలు

గత ఏడాది వరకు రోజుకి పది వేలు తీసుకున్న పృథ్విరాజ్, ఇప్పుడు రోజుకి రెండున్నర లక్షలు తీసుకుంటున్నాడు.ఇప్పుడు పృథ్వితాజ్ స్థాయి ఎంటో ఇంతకన్నా ఎక్కువ చెప్పలేం! .

Advertisement

తాజా వార్తలు