పేటలో పర్యటించిన ప్రిన్సిపల్ సెక్రటరీ,సీడీఎంఏ

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు ప్రిన్సిపల్ సెక్రటరీ సుదర్శన్ రెడ్డి,కమీషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఎన్.

సత్యనారాయణ అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న పనులను వారు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి,మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణతో కలసి పట్టణంలోని 60 ఫీట్ల రోడ్ లో చేపడుతున్న డీ షీల్ట్ పనులను పరిశీలించారు.అలాగే 4వ వార్డులోనే జైభారత్ టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతివనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ లో నిర్మిస్తున్న వెజ్ నాన్వెజ్ ఏబీసీ బ్లాక్ లను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించుకోవలని సూచించారు.

ప్రజలు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తాము ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు.ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి,డిఈ సత్యారావు,శానిటరీ ఇన్స్పెక్టర్లు సారగండ్ల శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి,ఎస్.

Advertisement

ఎస్.ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం
Advertisement

Latest Suryapet News