హనుమాన్ సంక్రాంతి రిలీజ్ తో రిస్క్ చేస్తున్నారా.. ప్రశాంత్ వర్మ ఏం ఆలోచిస్తున్నాడు?

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prashant Varma )

తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ ఇండియన్ సూపర్ హీరో సినిమా హను - మాన్.

ఈ సినిమాలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జ( Teja Sajja ) హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్ లుగా నటించారు.

ఈ సినిమా స్టార్టింగ్ లో పెద్దగా అంచనాలు ఏవీ లేవు.కానీ ఆ తర్వాత మాత్రం అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

Prashanth Varma-teja Sajjas hanuman Gets A Release Date, Hanuman, Prashanth V

ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ రిలీజ్( Hanuman Teaser ) తో అంచనాలు భారీగా పెంచుకోగా పాన్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.అందుకే గ్రాఫిక్స్ విషయంలో ఏ చిన్న మిస్టేక్ లేకుండా ఉండాలని వాయిదా వేశారు.అయితే రెండు మూడు వారాలు లేదంటే ఒక నెల వాయిదా వేస్తారేమో అనుకున్నారు.

కానీ ఈయన ఏకంగా 6 నెలల వాయిదా వేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.నిన్న ఈ విషయం అఫిషియల్ గా రాగానే అందరూ షాక్ అయ్యారు.

Advertisement
Prashanth Varma-Teja Sajja's 'HanuMan' Gets A Release Date, HanuMan, Prashanth V

ఎందుకంటే 6 నెలలు వదిలిపెట్టి టఫ్ ఫైట్ ఉండే సంక్రాంతి సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు.దీంతో ఈయన చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడేమో అనే సందేహం అందరిలో వచ్చింది.

దీనికి కారణం కూడా లేకపోలేదు.ప్రభాస్ ప్రాజెక్ట్ కే( Project K ) జనవరి 12న అని ఎప్పుడో ప్రకటించారు.

అలాగే మహేష్ గుంటూరు కారం సినిమాతో పాటు చిరంజీవి మూవీ, రవితేజ ఈగల్ మూవీలు రిలీజ్ అవుతున్నాయి.ఈ నాలుగు సినిమాల మధ్య హను మాన్ రిలీజ్ చేయడం ఖచ్చితంగా రిస్క్ అని అంటున్నారు.

అయితే ప్రశాంత్ వర్మ ఆలోచన ఏంటంటే.

Prashanth Varma-teja Sajjas hanuman Gets A Release Date, Hanuman, Prashanth V
శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

రిలీజ్ డేట్ ప్రకటించి పెట్టుకుంటే అప్పటికి ఈ సినిమాలన్నీ ఏవి రిలీజ్ అవుతాయో ఏవి వాయిదా వేస్తారో చూసుకుని హనుమాన్ రిలీజ్( Hanuman Release Date ) చేయాలా వద్దా అని ఆలోచించవచ్చు అని అందుకే ఇలా చేసారని టాక్ వినిపిస్తుంది.అందులోను ప్రాజెక్ట్ కే వాయిదా పడొచ్చు అనే టాక్ కూడా ఉంది.అందుకే ఈయన రిస్క్ తీసుకున్నాడు అని టాక్.

Advertisement

మరి అప్పటికి రిలీజ్ చేస్తాడో లేదో వేచి చూడాలి.

తాజా వార్తలు