ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ - జనసేన గెలుపు తథ్యం అంటున్న ప్రశాంత్ కిషోర్!

రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొద్ది నెలల్లోనే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.మరో రెండు వారాల్లో తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

 Prashant Kishore Says Tdp-jana Sena Victory In Andhra Pradesh Details, Prashant-TeluguStop.com

రెండు సార్లు భారీ మెజారిటీ తో అధికారం లోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కి( BRS ) ఈసారి గెలుపు కష్టమే అని, కాంగ్రెస్ పార్టీ( Congress ) విజయ కేతనం ఎగరవేస్తుంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.తెలంగాణ యువతలో బీఆర్ ఎస్ పార్టీ పై వ్యతిరేకత రావడం, అది కాంగ్రెస్ పార్టీ కి బాగా అనుకూలం అయ్యింది అంటూ సర్వేలు చెప్తున్నాయి.

మరో పక్క ఆంధ్ర ప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి అధికారం లోకి వచ్చిన వైసీపీ పార్టీ( YCP ) మీద తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.నాలుగేళ్లలో ఒక ప్రభుత్వం పై అన్నీ రంగాలకు చెందిన వారు తీవ్రమైన అసంతృప్తి తో ఉండడమ్ అనేది ఇదే తొలిసారి అని చెప్పొచ్చు.

Telugu Andhra Pradesh, Ap, Chandrababu, Jagan, Janasena, Pawan Kalyan, Tdpjana-T

ఈ వ్యతిరేకత టీడీపీ మరియు జనసేన పార్టీలకు బాగా కలిసొచ్చింది.రెండు విడివిడిగా పోటీ చేస్తే టీడీపీ కి( TDP ) వచ్చే స్థానాలు టీడీపీ కి వస్తాయి, జనసేన ( Janasena ) పార్టీ కి రావాల్సిన స్థానాలు జనసేన కి వస్తాయి.కానీ రెండు పార్టీలు అధికారం లోకి రావు, అదే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే, వైసీపీ పార్టీ గుండెల్లో గుబులు పుట్టడం ఖాయం.ఇప్పుడు అదే జరుగుతుంది.

ఇంతకు 175 స్థానాల్లో విజయ కేతనం ఎగరవెయ్యాలి, ఇదే మా లక్ష్యం అంటూ చెప్పుకొచ్చిన వైసీపీ పార్టీ, పొత్తు ప్రటకటన తర్వాత ధైర్యం గా ఒక్కసారి కూడా ఇప్పుడు అలా చెప్పలేకపోతుంది.అందుకు కారణం గ్రౌండ్ లెవెల్ నుండి అందుతున్న సర్వేల రిపోర్ట్స్ అని తెలుస్తుంది.

వైసీపీ పార్టీ కి సలహాదారుడిగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore ) కూడా రీసెంట్ గానే ఆంధ్ర ప్రదేశ్ లో ఒక సర్వే నిర్వహించాడు.

Telugu Andhra Pradesh, Ap, Chandrababu, Jagan, Janasena, Pawan Kalyan, Tdpjana-T

ఈ సర్వే రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది ఏమిటంటే ఆంధ్ర ప్రదేశ్ లోని కోస్తాంధ్ర ప్రాంతం లో( Coastal Andhra ) సరైన రీతిలో సీట్ల సర్దుబాటు ఇరు పార్టీల మధ్య జరిగితే కోస్తాంధ్ర మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని, వైసీపీ పార్టీ కి ఒక్క స్థానం కూడా వచ్చే అవకాశం లేదని ఈ సర్వే రిపోర్టు తేల్చింది అట.వైసీపీ కి ఎన్ని స్థానాలు వచ్చినా ప్రకాశం, నెల్లూరు మరియు గ్రేటర్ రాయలసీమ నుండే అసెంబ్లీ స్థానాలు వస్తాయని, మిగిలిన చోట్ల అసలు ఎలాంటి ప్రభావం ఉండబోదని అంటున్నారు.ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరో నాలుగు నెలలు వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube