ప్రభాస్ హీరో గా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వం లో యు.వి.
క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని చాలా నెలలు అవుతుంది.ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించారు.
సంక్రాంతి కి ఈ సినిమా విడుదల అవుతుందని అంతా భావించిన కూడా కరోనా వల్ల సినిమా ని చివరి నిమిషం లో వాయిదా వేయడం జరిగింది.వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
సినిమా విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండటం తో అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు ఉత్కంఠ భరితంగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.భారీ బడ్జెట్తో ఈ సినిమాను రూపొందించడం తో పాటు ఒక విభిన్నమైన కథ తో ఈ సినిమాని తెరకెక్కించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఈ సినిమా లో హీరో జ్యోతిష్యుడు గా కనిపించబోతున్నట్లు గా ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.ఇక ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు సభ్యులు ఈ సినిమా చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.ఇది ఒక అద్భుతం అన్నట్లుగా వారు కామెంట్ ఇచ్చారట.
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన కామెంట్ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇప్పటికే ఉన్న అంచనాలను పతాక స్థాయికి తీసుకు వెళ్లేలా కామెంట్స్ ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.
అతి భారీగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు గాను యు.వి.క్రియేషన్స్ మరియు టి సిరీస్ వాళ్లు భారీ ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తి అయ్యాయట.
పదివేల స్క్రీన్స్ లో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.మినిమమ్ సక్సెస్ అయినా కూడా ఈ సినిమా ఖచ్చితంగా రూ.500 కోట్ల వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ ఈ సినిమా తో మరోసారి పాన్ ఇండియా స్టార్ గా నిరూపించుకోవడం కారణం అనిపిస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy