'రాధేశ్యామ్‌' కొత్త విడుదల తేదీ రాబోతుంది

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధే శ్యామ్‌ షూటింగ్ ను మూడు రోజుల్లో ముగించబోతున్నారట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జులై 30వ తారీకున సినిమా షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Prabhas Radeshyam Movie Release Date Update, Film News, Movie News, News In Telu-TeluguStop.com

ప్రభాస్‌ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం అదే సమయంలో షూటింగ్‌ ముగింపు ఫోస్టర్‌ ను మరియు కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.ఆర్‌ ఆర్‌ ఆర్‌ విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా ఉన్న అస్పష్టత కారణంగా ఈ సినిమా విడుదల తేదీని సస్పెన్స్ లో ఉంచుతూ వచ్చారు.

ఎట్టకేలకు షూటింగ్‌ ను ముగింపు దశకు తీసుకు రావడంతో పాటు గుమ్మడి కాయ కొట్టేందుకు సిద్దం అవుతున్నారు.కనుక రాధే శ్యామ్‌ సినిమా విడుదల తేదీని ప్రకటించాబోతున్నారు.

యూవీ క్రియేషన్స్‌ వారి నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాధే శ్యామ్‌ విడుదల తేదీని జులై 30వ తారీకున ప్రకటించబోతున్నారు.అప్పటికే షూటింగ్‌ ను ముగిస్తారు కనుక ఒక పోస్టర్‌ ను కూడా విడుదల చేయబోతున్నారు.

అంతే కాకుండా ఇకపై రెగ్యులర్‌ గా వీడియోలు మరియు ఫొటోలను రిలీజ్‌ చేస్తూ ప్రమోషన్‌ కార్యక్రమాలను బిజీ అవ్వబోతున్నారు.షూటింగ్‌ ను గత మూడు సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు.

Telugu July, Krishnam Raju, Telugu, Pooja Hegde, Prabhas, Radheshyam, Regular, T

సాహో సినిమా విడుదలకు ముందు ఒక షెడ్యూల్‌ ను ముగించిన చిత్ర యూనిట్ సభ్యులు కొన్ని కారణాల వల్ల లేట్ చేస్తూ వచ్చారు.ఎట్టకేలకు షూటింగ్‌ ను ముగించి వచ్చే నెల లేదా ఆ తర్వాత నెలలో విడుదల చేసేందుకు సిద్దం చేస్తున్నారు.దసరా కానుకగా ఇప్పటికే ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల ఉన్న కారణంగా ముందు ముందు వచ్చే సినిమాలు ఏంటీ అనే విషయంలో ఒక స్పష్టతకు వచ్చి మూడు రోజుల్లో కొత్త విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.ఈ సినిమా లో ప్రభాస్‌ కు జోడీగా పూజా హెగ్డే నటించగా , కృష్ణం రాజు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube