వాయిదా పడిన జగన్ ఆస్తుల కేసు విచారణ.. ఎప్పటి వరకు అంటే.. ?

ఏపీ సీఎం జగన్ పై ఎప్పటి నుండో పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

ఇక టీవీ సీరియల్ ఎలాగైతే సాగుతుందో అలా ఈ అక్రమాస్తుల కేసు కూడా సాగుతూ వస్తుందట.

ఈ వ్యవహారంలో నేడు సీబీఐ-ఈడీ కోర్టు విచారణ చేపట్టగా సీఎం జగన్ తాను విచారణకు హజరు కాలేక పోతున్నానని కాబట్టి తన తరపున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారట.కాగా హైకోర్టు జడ్జి సెలవులో ఉండటంతో పిటిషన్ విచారణకు రాలేదని కూడా సీబీఐ-ఈడీ కోర్టుకు వివరించారట.

Postponed Jagan Assets Case Hearing, AP CM, YS Jagan, Assets Case, Hearing, Post

ఈ క్రమంలో కోర్టు విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేస్తూ ఈ కేసులో జగన్ తరఫు వాదనలు కూడా అవసరమని అభిప్రాయపడిందట.ఇకపోతే అక్రమాస్తుల వ్యవహారంలో హెటిరో, అరబిందో సంస్థలకు భూ కేటాయింపుల్లో అవినీతి జరిగిందన్న అభియోగాలతో ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌ 2016లో కేసు నమోదు చేసి సీఎం జగన్ ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు.

కాగా నాటి నుండి ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఈ కేసు ఏదో ఒక కారణంతో వాయిదాపడుతు వస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

తాజా వార్తలు