బైక్స్ దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు...!

సూర్యాపేట జిల్లా:కోదాడ, హుజూర్ నగర్ ( Kodada, Huzur Nagar ) నియోజకవర్గాల పరిధిలో గల రెండేళ్లుగా మోటార్ సైకిళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన గుండు ఆంజనేయులును కోదాడ పోలీసులు పట్టుకుని, అతని వద్ద నుండి 15 మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకుని,కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు కోదాడ డిఎస్పీ ప్రకాష్ జాదవ్ మీడియా సమావేశంలో తెలిపారు.

అతని భార్య వదిలేడంతో జులాయిగా తిరుగుతూ విలాసాలకు అలవాటు పడి మోటార్ సైకిళ్ళ దొంగతనం చేయడం ప్రారంభించినట్లు విచారణలో తేలిందన్నారు.

కోదాడ పట్టణ పరిధిలో 9, మునగాల మండల 1, నడిగూడెం మండల( Nadigudem mandal ) పరిధిలో 1,అనంతగిరి మండల పరిధిలో 2, హుజూర్ నగర్ మండల పరిధిలో 2,మొత్తం 15 మోటార్ సైకిళ్ళను దొంగలించాడని వెల్లడించారు.గురువారంకోదాడలోని రంగా థియేటర్ చౌరస్తా వద్ద అనుమానస్పదంగా నిందితుడు కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకొన్నట్లు వివరించారు.

కోదాడ డిఎస్పీ ప్రకాష్ పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించిన కోదాడ పట్టణ సీఐ రాము,పట్టణ ఎస్సై రామాంజనేయులు మరియు సిబ్బందిని అభినందించారు.

Advertisement

Latest Suryapet News