తండాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్న పిల్లుట్ల రఘు

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్( Huzur Nagar ) నియోజకవర్గంలో ఏ గ్రామం,చిన్న తండా కూడా వదలకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ,వర్షంలో తడుస్తూ తండా వాసులతో చిందులేస్తూ ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు వినాయక చవితి వేడుకలలో పాల్గొంటున్నారు.

మేళ్ళచెరువు మండలంలోని హెమ్లతండా,జగ్గుతండా, కప్పలకుంటతండా,పీక్ల నాయక్ తండా,రేవూరు లలో విస్తృతంగా పర్యటిస్తూ వినాయక పూజలలో పాల్గొంటూ తండ ప్రజలతో మమేకమై వారితో కలిసి ఆడిపాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఒక్క అవకాశం ఇచ్చి చూడండి,పార్టీలకు, కులమతాలకు అతీతంగా పరిపాలన చేసి మీకందరికీ ఇంతకంటే ఇంకా ఎక్కువ ప్రజలలో పర్యటిస్తూ ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తానని అన్నారు.వర్షం లో కూడా ప్రజలతో మమేకమై చిందులేస్తూ రంగుల మయమై కూడా ప్రజలకు దిశ నిర్దేశం చేస్తూ నేను ఉన్నానంటూ ప్రతి ఒక్కరినీ అక్కున చేర్చు కుంటానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో తండా వాసులు,యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

భారతీయ అమ్మ తెలివైన ట్రిక్..
Advertisement

Latest Suryapet News