మోకాళ్ళ లోతు నీటిలో నరకం చూస్తున్న ప్రజలు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం( Garidepalli )లో గడ్డిపల్లి నుండి కుతుబుషాపురం వెళ్లే రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి,వర్షా కాలంలో వచ్చిందంటే మోకాళ్ళ లోతు నీరు నిలిచి చెరువు తలపిస్తూ ప్రతీ ఏటా ప్రజలు,ప్రయాణికులు నరకం చూస్తున్నామని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు.

సాధారణ సమయంలోనే గుంతల కారణంగా ప్రమాదకర ప్రయాణం చేస్తున్నామని,వర్షాకాలంలో అయితే ఇకమా పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.

అసలే ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని,ఇప్పుడు గుంతలలో మోకాళ్ల లోతు నీరు ఉండటంతో ఆటోలు కూడా నడిచే పరిస్థితి లేకఅవస్థలు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడని,కుతుబుషాపురం గ్రామానికి కొత్త రోడ్డు వేయాలని ఎన్నిసార్లు విన్నవించినా మా మొర ఆలకించే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొత్త రోడ్డు సంగతి దేవుడెరుగు కనీసం రోడ్డుపై పెద్దపెద్ద గుంతలైనా పూడ్చి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

People Watching Hell In Knee Deep Water, Garidepalli, Suryapet District, Heavy R

Latest Suryapet News