నేటి నుండి మొదలైన పవన్‌ మూవీ.. ముగింపు ఎప్పుడంటే!

కరోనా సెకండ్‌ వేవ్‌ కు ముందే పవన్‌ కళ్యాణ్‌ పాజిటివ్‌ అంటూ తేలడం వల్ల ఆయన షూటింగ్‌ లు నిలిచి పోయాయి.

మళ్లీ పవన్‌ సినిమాలు ఎప్పుడు పునః ప్రారంభం అవుతాయి అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు పవన్‌ సినిమాలు తిరిగి ప్రారంభం అయ్యాయి.నేడు రానా తో పవన్ చేస్తున్న మలయాళ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమా రీమేక్‌ షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది.

హైదరాబాద్‌ లో ఈ సినిమా ను పట్టాలెక్కించారు.సినిమా షూటింగ్‌ మూడు నుండి నాలుగు వారాల్లో ముగుస్తుందని అంటున్నారు.

సాగర్‌ చంద్ర దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమా కు స్క్రీన్‌ ప్లే మరియు డైలాగ్స్ ను త్రివిక్రమ్‌ అందిస్తున్న విషయం తెల్సిందే.పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ భారీ ఎత్తున అంచనాలు పెట్టుకున్న ఈ సినిమాను దర్శకుడు సాగర్‌ చంద్ర ఇదే ఏడాదిలో విడుదల చేయాలని భావించాడు.

Advertisement
Pawan And Rana Movie Shooting Starts Today , Film News , Hari Hara Veera Mallu,

కాని కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల అది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Pawan And Rana Movie Shooting Starts Today , Film News , Hari Hara Veera Mallu,

పవన్‌ నేటి నుండి షూటింగ్‌ లో పాల్గొంటున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.ఈ సినిమా లో పవన్‌ మరియు రానాల మద్య సన్నివేశాలు చాలా అద్బుతంగా వస్తాయట.సినిమా షూటింగ్‌ ప్రారంభం అయినప్పటి నుండి ఈ మల్టీ స్టారర్‌ సినిమా పై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా లో హీరోయిన్‌ లు గా నిత్యా మీనన్ మరియు ఐశ్వర్య రాజేష్‌ లు కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.పవన్‌ మరో వైపు హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ కు కూడా రెడీ అవుతున్నాడు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ను కూడా మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

తాజా వార్తలు