లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయితీ కార్యదర్శి

నల్లగొండ జిల్లా:డిండి గ్రామ పంచాయతీ కార్యదర్శి గంజి శ్రవణ్ కుమార్( Shravana Kumar ) పదివేలు లంచం తీసుకుంటూ గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు.

డిండి మండల కేంద్రం పంచాయతీ కార్యదర్శిగా మరియు మండల తాత్కాలిక ఎంపీవోగా విధులు నిర్వహిస్తున్న గంజి శ్రవణ్ కుమార్.

డిండి గ్రామానికి చెందిన భైరోజు శంకరమ్మ భర్త తిరుపతయ్య గతంలో ఎప్పుడో కొన్న ఫ్లాట్ తాలూకు డాక్యుమెంట్స్ లేకపోవడంతో ఆ డాక్యుమెంట్స్ కోసమని బాధితులు కార్యదర్శి శ్రవణ్ కుమార్ ను కలవడంతో శ్రవణ్ పదివేలు డిమాండ్ చేయగా కొద్దిరోజుల క్రితం 5 వేలు ఇచ్చారు.మళ్ళీ ఇంకా పదివేలు కావాలని ఒత్తిడి చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.

Panchayat Secretary Caught Taking Bribe , Panchayat Secretary , Shravana Kumar,

ఏసీబీ అధికారులు( ACB officials) వలపన్ని శ్రవణ్ కుమార్ కు డబ్బులు ఇచ్చే క్రమంలో చాకచక్యంగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఏసీబీ అధికారి మాట్లాడుతూ కేసు నమోదు చేసామని, దర్యాప్తు జరుగుతుందని, శుక్రవారం ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

ఎవరైనా అవినీతికి పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement
మనుషులకు ఇక చావు లేదు.. అమరత్వ రహస్యం కనిపెట్టిన సైంటిస్టులు..?

Latest Nalgonda News