రైతులకు ఇస్తానన్న 35 లక్షల విషయం లో మాట మార్చేసిన పల్లవి ప్రశాంత్..అసలు రంగు బయటపడిందిగా!

కామన్ మ్యాన్ మరియు రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ ( Bigg Boss House )లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా నిలిచి చరిత్ర తిరగరాసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఒక కామన్ మ్యాన్ సాధించిన ఈ విజయానికి అందరూ ఎంతో సంతోషించారు.

సెలెబ్రిటీలు మరియు రాజకీయ నాయకులూ కూడా పల్లవి ప్రశాంత్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారు.అయితే పల్లవి ప్రశాంత్ ఇలా టైటిల్ ని గెలవడానికి అసలు కారణం శివాజీ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ప్రశాంత్ హౌస్ లోకి అడుగుపెట్టిన కొత్తల్లో చాలా వింతగా ప్రవర్తించే వాడు.ప్రతీ సందర్భం లోను రైతు బిడ్డ అనే పదాన్ని తీసుకొచ్చి సానుభూతి పొందాలని చూసాడు.

కానీ శివాజీ అమర్ దీప్ మీద ఉన్న కోపం తో ప్రశాంత్ ని నోరు తూలకుండా ఆపుతూ అతన్ని కంట్రోల్ చేస్తూ టైటిల్ ని గెలిచేలా చేసాడు.

Pallavi Prashanth Who Changed His Word On The Matter Of 35 Lakhs That He Would G
Advertisement
Pallavi Prashanth Who Changed His Word On The Matter Of 35 Lakhs That He Would G

అయితే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ప్రవర్తిస్తున్న తీరుని చూసి అతనికి ఓట్లు వేసిన ఆడియన్స్ కంగుతిన్నారు.ఇన్ని రోజులు వినయ విధేయ ప్రశాంత్ గా హౌస్ లో మన అందరికీ కనిపించిన వ్యక్తి ఇతనేనా అని అనుకుంటున్నారు.బహుశా శివాజీ( Shivaji ) ఇతని ప్రవర్తన ని చూసినా కూడా ఇలాగే షాక్ కి గురి అవుతాడేమో.

పోలీసుల తో మర్యాదగా ప్రవర్తించకపోవడం, వాళ్ళు ఇచ్చిన ప్రొటొకాల్స్ ని ఉద్దేశపూర్వకంగానే బ్రేక్ చెయ్యడం.శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించడం, ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా ప్రశాంత్ పై కట్టలు తెంచుకునే కోపం వచ్చేలా చేస్తుంది ఆడియన్స్ కి.ఇన్ని రోజులు అమర్ దీప్ ని తప్పు బట్టాము.అతను చెప్పినట్టుగానే ప్రశాంత్ ని రెండు ముఖాలు, రెండు నాలుకలు ఉన్నాయి అని అతనికి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

Pallavi Prashanth Who Changed His Word On The Matter Of 35 Lakhs That He Would G

ఇకపోతే రీసెంట్ గా ఒక యాంకర్ మీరు గెలిచిన డబ్బులను రైతులకు ఇస్తానని చెప్పారు కదా,అదే మాట మీద ఉన్నారా అని అడగగా, కచ్చితంగా ఆ మాట మీదనే ఉన్నాను, గెలిచిన ప్రతీ పైసానీ ఎలా ఉపయోగిస్తానో మీరే చూస్తారు అంటూ ప్రశాంత్ అనగా, అప్పుడు యాంకర్ మీ పక్క గ్రామంలో ఈమధ్యనే ఎంతో మంది పంట పోగొట్టుకొని కష్టాల్లో ఉన్నారు, మీరు సహాయం చెయ్యాలనుకుంటే వాళ్ళకే చెయ్యొచ్చు కదా అని అడగగా, దానికి ప్రశాంత్ సమాధానం చెప్తూ నేను ముఖ్యమంత్రిని కాదు అంత మందికి సహాయం చెయ్యడానికి అంటూ చాలా పొగరుగా మాట్లాడాడు.ఇక టైటిల్ గెలిచిన తర్వాత ఇంటర్వ్యూస్ అడిగిన వాళ్లకు కూడా అసభ్య పదజాలంతో నేను ఇవ్వను దొబ్బెయ్ అంటూ అమర్యాదగా మాట్లాడుతున్నాడు.ప్రశాంత్ కి ఓట్లు వేసిన గెలిపించింది, అతని వినయం ని చూసే, ఇప్పుడు ఆ వినయమే కరువు అయ్యింది.

రాబొయ్యే రోజుల్లో ఇంకెన్ని యాంగిల్స్ ని చూపిస్తాడో చూడాలి.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు