మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

చాలా మంది ఎదుర్కొనే జీర్ణ సంబంధిత సమస్యల్లో మలబద్ధకం ఒకటి.మ‌ల‌బ‌ద్ధ‌కం అనేది చిన్న స‌మ‌స్య‌గానే అనిపించినా.

 These Are The Best Drinks To Get Rid Of Constipation Constipation, Constipation-TeluguStop.com

దీన్ని నిర్ల‌క్ష్యం చేస్తే అనేక జ‌బ్బులు త‌లెత్తుతాయి.అందుకే మలబద్ధకాన్ని నివారించుకోవాలి.

అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ అందుకు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.రోజు ఈ డ్రింక్స్ ను తీసుకుంటే మలబద్ధకం పరార్ అవ్వడమే కాదు మరెన్నో ఆరోగ్య‌ లాభాలు కూడా పొందవచ్చు.

మరి ఇంతకీ ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

డ్రై ఆప్రికాట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను చురుగ్గా మార్చడానికి డ్రై ఆప్రికాట్స్ హెల్ప్ చేస్తాయి.నైట్ నిద్రించే ముందు ఒక గ్లాసు నీటిలో రెండు లేదా మూడు డ్రై ఆప్రికాట్స్ నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే ఆ వాటర్ తో పాటు డ్రై ఆప్రికాట్స్ ను కూడా తీసుకోవాలి.ఇలా చేయడం మలబద్ధకం దూరం అవుతుంది.

రక్తహీనత ఉంటే తగ్గుముఖం పడుతుంది.ఎముకలు బలోపేతం అవుతాయి.

అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి చియా సీడ్స్ కూడా ఎంతో మేలు చేస్తాయి.నిత్యం ఉదయాన్నే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి నానబెట్టి తీసుకోవాలి.

చియా సీడ్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది పేగు కదలికలను మెరుగుపరుస్తుంది.మలబద్దకాన్ని తరిమి కొడుతుంది.పైగా చియా సీడ్స్ ను తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.

రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

Telugu Chia Seeds, Drinks, Dry Apricots, Fenugreek Seeds, Tips, Latest, Raisins

మలబద్ధకం సమస్య ఉన్న‌వారికి కిస్ మిస్ వాటర్ కూడా గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్ లో పది కిస్ మిస్ లు వేసి నానబెట్టి ఉదయాన్నే వాటర్ తో సహా వాటిని తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల మలబద్ధకం మాత్రమే కాదు గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి ఇతర జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

ఇక మెంతులు కూడా జీర్ణక్రియ ఆరోగ్యానికి సహాయపడతాయి.మెంతులు మరిగించిన నీటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది.అదే సమయంలో కొలెస్ట్రాల్ కరుగుతుంది.గుండె ఆరోగ్యంగా మారుతుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది.కంటి చూపు సైతం మెరుపు పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube