ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తు కోదురుపాక లో మందకృష్ణకు పాలభిషేకం

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమొద ముద్ర వేసిన సందర్భంగా బోయినపల్లి మండలం కొదురుపాక లో ఎమ్మార్పీఎస్ నాయకులు కత్తెరపాక రవీందర్ ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ఊరిలో ర్యాలీగా వెళ్లారు అనంతరం టపాసులు పేల్చి మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.

అనంతరం పలువురు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మంద కృష్ణ మాదిగ కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం సుదీర్ఘకాలంగా పోరాటం జరుగుతుందని అన్నారు .దీంతో పాటు ఏబిసిడి వర్గీకరణ చేయాలని కోరుతున్నామని అన్నారు.ఇది ఒక జాతికి దక్కిన గౌరవంగా అభివర్ణిస్తూ ఇది తీపి కబురు అని అన్నారు.

Palabhishekam To Mandakrishna In Kodurupaka To Welcome Supreme Court Verdict On

మంద కృష్ణ ఎమ్మార్పీఎస్ స్థాపించి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటూ పార్టీల కతీతంగా 30 సంవత్సరాల పైగా పోరాటం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కోనాపూర్ లక్ష్మణ్ ,ఎమ్మార్పీఎస్ నాయకులు జిల్లా నాయకులు కత్తెరపాక రవీందర్, సావనపల్లి రాజు ,బీఎస్పీ నాయకులు మహంకాళి తిరుపతి ,కత్తెరపాక మల్లయ్య ,కుడుకల దుర్గయ్య ,సుద్దల రాములు,ఎమ్మార్పీఎస్ యూత్ నాయకులు కత్తెర పాక మనోహర్ ,మల్లపల్లి శ్రీనివాస్ కత్తెరపాక అనిల్, తదితరులు ఉన్నారు.

కస్టమర్‌లా వచ్చింది.. అందరి కళ్లుగప్పి చెప్పులు కొట్టేసింది.. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే!
Advertisement

Latest Rajanna Sircilla News