బంగాళాదుంప పంటలో ఎరువుల యాజమాన్యం.. అనువైన కాలాలు.. సస్యరక్షక పద్ధతులు..!

బంగాళదుంప ( potato)ప్రపంచంలోనే అతి ప్రధానమైన మూడవ ఆహార పంట.తాజా కూరగాయలలో బంగాళదుంప ఒకటి.

 Ownership Of Fertilizers In Potato Crop.. Suitable Periods.. Plant Protection M-TeluguStop.com

బంగాళదుంప సాగుకు ఇసుక, గరప నేలలు( Sandy and loamy soils) చాలా అనుకూలంగా ఉంటాయి.ఇంకా పీహెచ్ విలువ 4.5 నుంచి 5.5 వరకు ఉండి, మద్యస్థంగా ఉన్న చలి కాలం పంటకు అనుకూలమని చెప్పాలి.

నేలను లోతు దుక్కులు దున్ని సూర్యరశ్మి( sunshine ) తగిలేలాగా రెండు లేదా మూడు వారాలు నేలను అలాగే ఉంచడం వల్ల రకాల పురుగుల, తెగుళ్ల సమస్యలు, అధికంగా ఉండవు.దుంపల విషయానికి వస్తే ఎండ తగలకుండా కోల్డ్ స్టోరేజ్ లో ఉంచిన, గోనెపట్టాలలో ఉంచిన దుంపలను ఎంచుకొని మంచి అంకురోత్పత్తి కోసం దాదాపు 35 గ్రాముల బరువున్న మొలకెత్తిన దుంపలను ఎంచుకోండి.

తెగిపోయిన, కుళ్లిపోయిన దుంపలను తొలగించండి.

విత్తనాలుగా వాడే దుంపలను మాంకోజెబ్ 75%wp రెండు గ్రాములు+ స్ట్రేప్టోమైసిన్ సల్ఫేట్ 9% + టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ 1%sp 0.25 గ్రా.ఒక లీటర్ నీటిలో కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే చాలా రకాల వరకు తెగుళ్లను అరికట్టవచ్చు.

తర్వాత వీటికి నేరుగా ఎండ తగలకుండా మంచి గాలి, వెలుతురు తగిలే ప్రదేశంలో ఉంచాలి.

బంగాళదుంప సాగుకు ఎకరానికి ఐదు టన్నుల పశువుల ఎరువు, 200 కేజీల వేప పిండి, రెండు కేజీల అజో స్పైరిల్లం, రెండు కేజీల పాస్ఫో బ్యాక్టీరియా నేలలో వేసి కలియదునాలి.భూమి యొక్క సామర్థ్యాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి మెత్తగా దున్నుకోవాలి.మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు వరుసల మధ్య 60 సెంటీమీటర్లు ఉండేలాగా మడులను ఏర్పాటు చేసుకోవాలి.

విత్తడానికి రెండు రోజులు ముందు నీటిని పారిస్తే మొలకలు తొందరగా వచ్చే అవకాశం ఉంది.భూమి లోపల దాదాపు పది సెంటీమీటర్ల లోతులో దుంపలను నాటుకోవాలి.ఇక నీటిని డ్రిప్ విధానం ద్వారా అందించాలి.నెలలో కనీసం రెండుసార్లు నీటిని పారించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube