పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ తెలిపారు.

ఈ సందర్బంగా వేములవాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ -21 గురించి విద్యార్థుల కు వివరించటం జరిగిందని,ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కు వారోత్సవాలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహించడం జరుగుతుంది అని, పోలీస్ స్టేషన్లో లో ఏమేమి విధులు నిర్వహిస్తారు,పోలీస్ స్టేషన్లో సామాగ్రి గురించి వివరించటం జరిగింది అని అన్నరు.

పోలీస్ అంటే ప్రజా రక్షకులు అని ప్రతీ ఒక్కరు అత్యవసరం అయితే పోలీస్ సేవలు వినియోగించుకోవాలి అని తెలిపారు.ఈ కార్యక్రమం లో రూరల్ ఎస్ ఐ మారుతీ, ఏ ఎస్ ఐ మల్లయ్య, సిబ్బంది వెంకటేష్,శంకర్, రాజశేఖర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Open House Program At Vemulawada Rural Police Station As Part Of Police Martyrs
నితిన్ వరుస సినిమాలతో సక్సెస్ లను సాధిస్తాడా..?

Latest Rajanna Sircilla News