ఒక్క మార్కు..ఒకే ఒక్కమార్కు..1.85 లక్షల మందిని ఫెయిల్‌ చేసింది...!

నల్లగొండ జిల్లా:తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఒక్క మార్కు తేడా అనేకమంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపింది.బోర్డు వర్గాల ప్రకారం, దాదాపు 1.

85 లక్షల మంది విద్యార్థులు ఒక్క మార్కు తేడాతో ఉత్తీర్ణత సాధించలేకపోయారు.ఇది విద్యార్థులు,తల్లిదండ్రుల్లో ఆవేదనను కలిగించింది.ఈ ఏడాది మొత్తం ఉత్తీర్ణత శాతం 71.37గా నమోదైంది.ఇందులో బలమైన ప్రదర్శన కనబర్చిన గురుకుల విద్యా సంస్థలు 83.17 శాతం ఉత్తీర్ణతతో ముందున్నాయి.అంతేకాకుండా,కొన్ని కళాశాలల్లో టాప్‌ మార్కులు సాధించిన విద్యార్థులు మెరిశారు.

బైపీసీ స్ట్రీమ్‌లో ఓ విద్యార్థిని 997 మార్కులతో టాప్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.అలాగే ఎంపీసీలో నలుగురు విద్యార్థులు 996 మార్కులు సాధించారు.

దేవరకొండ గిరిజన సంక్షేమ పాఠశాలలో చదివిన విద్యార్థిని కూడా బైపీసీలో 996 మార్కులు సాధించడం విశేషం.ఇదిలా ఉంటే1.85 లక్షల మంది ఫెయిల్‌ కావడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వారు చెప్పినట్లు, గ్రేస్‌ మార్కులు, రీ-వెల్యూయేషన్‌ విధానాలపై స్పష్టత అవసరం.

Advertisement

అలాగే విద్యార్థుల మెరుగైన మానసిక స్థితిని పరిగణలోకి తీసుకుని మరింత హృదయపూర్వక పరీక్షా విధానం అవసరమని సూచిస్తున్నారు.రీవాల్యువేషన్,రీకౌంటింగ్‌లో ఇందులో చాలా మంది పాస్‌ అయ్యే అవకాశం ఉంది.

ఇక మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.దీనికి సంబంధించిన షెడ్యూల్‌ మే మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇందులో ఫెయిల్‌ అయిన విద్యార్థులు ఫాస్‌ అయ్యే అవకాశం ఉంది.

Latest Suryapet News