అన్నదమ్ముల భూ ఘర్షణలో ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా: చింతలపాలెం మండల కేంద్రంలో మూడు రోజుల క్రితం పొలం బాట విషయంలో సొంత అన్నదమ్ములైన గుగులోతు చందర్రావు,గుగులోతు పాచ్యా వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి ఒక నిండు ప్రాణం బలితీసుకుంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

సోమవారం గుగులోతు చందర్రావు,గుగులోతు పాచ్య వర్గాల మధ్య పొలం దగ్గర బాట విషయంలో గొడవ జరిగింది.అనంతరం ఇరువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.

గాయాలైన వాచ్యా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్ళడానికి సెంటర్ లో వేచి ఉండగా చందర్రావు వర్గం వారు, జగ్గయ్యపేటకు చెందిన వారి బంధువులతో మూకుమ్మడిగా కారం, కర్రలతో దాడి చేయడంతో గుగులోత్ పాచ్యకు బలమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.గుగులోతు వాచ్యా తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమించడంతో గాంధీ హాస్పిటల్ వైద్యులు వాచ్యాను పరీక్షలు చేసిన తలకు ఆపరేషన్ చేశారు.

బుధవారం ఉదయం సుమారు మూడు గంటల సమయంలో గుగులోతు వాచ్యా మృతి చెందారని బంధువులు తెలిపారు.మృతునికి భార్య,ఇద్దరు కుమార్తెలు,కుమారుడు ఉన్నారు.

Advertisement

ఈ దాడిలో గాయపడిన మరికొందరు మెరుగైన వైద్యం కోసం వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు సమాచారం.దీనితో చింతలపాలెంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కోదాడ డిఎస్పీ ప్రకాష్ జాదవ్ తెలిపారు.

ఇది కేవలం భూ వివాదం మాత్రమేనని,ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని అన్నారు.జరిగిన ఘటనపై మృతుడు గుగులోతు వాచ్యా కుటుంబ సభ్యుల,బంధువుల వాదన మరోలా ఉంది.

ఇరు కుటుంబాల మధ్య ఏర్పడిన భూ వివాదాన్ని అధికార పార్టీకి చెందిన వారు రాజకీయ వివాదంగా మార్చి,తమ వర్గానికి చెందిన గుగులోతు చందర్రావును ఉసిగొల్పి,వారి బంధువులను పిలిపించి, స్థానిక పోలీసుల సహకారంతో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గుగులోతు వాచ్యా కుటుంబంపై కారం చల్లి,కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేయించారని,ఈ దాడిలో మహిళలు సైతం తీవ్రంగా గాయపడ్డారని ఆరోపిస్తున్నారు.

స్టార్ హీరో బాలయ్య ఫిట్ నెస్ సీక్రెట్ ఇదేనా.. ఆ ఫుడ్ మాత్రమే ఇష్టంగా తింటారా?
Advertisement

Latest Suryapet News