కుక్కను తప్పించబోయి కూలీల ఆటో బోల్తా ఒకరు మృతి

సూర్యాపేట జిల్లా: ఆత్మకూర్(ఎస్) మండలం కోటపహాడ్ గ్రామంలో బుధవారం ఉదయం మిరప కూలీల ఆటో బోల్తాపడి ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మహిళలు ఆటోలో మిరప తోట వేరుటకు వెళ్తుండగా కోట పహాడ్ వద్దకు రాగానే కుక్క ఎదురుగా రావడంతో దానిని తప్పించబోయి ఆటో బోల్తా కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.

క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.ప్రమాద బాధితులు సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.

One Killed As Auto Carrying Laborers Overturns While Trying To Save Dog,Kotapaha

Latest Suryapet News