రాళ్ళ దాడి ఘటనపై ఇంకా ఆగని రగడ... రంగంలోకి గవర్నర్

తెలంగాణ రాజకీయాలు మునుపెన్నడూ లేనంతగా అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల తూటాలతో ఘర్షణ వాతావరణం అనేది నెలకొన్న పరిస్థితి ఉంది.

అయితే తెలంగాణలో ఇంతకు మునుపు ఇలాంటి ఘర్షణ వాతావరణ సంస్కృతి లేదు.

గత ఆరు నెలలు సంవత్సర కాలంగా రాజకీయ ఘర్షణ వాతావరణం అనేది మొదలైంది.అయితే తాజాగా ఎంపీ ధర్మపురి అరవింద్ పైవీల్ నిజామాబాద్ లో జరిగిన దాడి ఘటనకు సంబంధించిన రగడ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి ఉంది.

ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించడం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.అయితే ఈ ఘటనపై ఢిల్లీలో కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు.

ఇటు రాష్ట్రంలో కూడా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కు కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదు చేశారు.అయితే అరవింద్ ఫిర్యాదుపై గవర్నర్  తమిళి సై  స్పందించారు.

Advertisement
On The Stone Attack Incident Still Unstoppable . Governor Into The Field Bjp Pa

వెంటనే ఎంపీ ధర్మపురి అరవింద్ కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.ఇక ఈ రాళ్ళ దాడి ఘటనపై గవర్నర్ కూడా స్పందించడంతో మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.

On The Stone Attack Incident Still Unstoppable . Governor Into The Field Bjp Pa

అయితే ఈ ఘటనపై గవర్నర్ ఇంకా ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఇప్పటికీ విశ్వసనీయ సమాచారం లేకున్నా సరైన సమయంలో స్పందిస్తుందనేది ఒక ప్రచారం నడుస్తోంది.అయితే ఇటీవల గణతంత్ర వేడుకలకు కెసీఆర్ హాజరుకాకపోవడంతో గవర్నర్ కు కెసీఆర్ కు మధ్య విభేదాలు వచ్చాయని మరొక ప్రచారం జోరుగా కొనసాగింది.దీనిపై ఇటు కెసీఆర్ కాని గవర్నర్ కాని క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇక చర్చ అనేది సద్దుమణిగింది.

మరి గవర్నర్ ఈ ఘటనపై ఎలా ముందుకెళ్తుందనేది చూడాల్సి ఉంది.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement

తాజా వార్తలు