నేటి నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభం!

భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పూరీ జగన్నాథ రథయాత్ర చాలా ప్రశస్తి కలదు.హిందూవులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ ర థయాత్రలో పాల్గొంటారు.

పదిరోజుల పాటు నిర్వహించే ఈ యాత్రను ఒడిషాలోని పూరీ జగన్నాథ టెంపుల్‌లో నిర్వహిస్తారు.హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాది ఆషాఢ శుక్లపక్షం రెండో రోజు నుంచి ఈ ఉత్సవాలు మొదలవుతాయి.

ఈ ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం ఇసుకేస్తే రాలని విధంగా భక్తులు పాల్గొంటారు.కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ఈసారి భక్తులు లేకుండానే యాత్రను నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ యాత్రలో వేప చెక్కతో తయారు చేసిన రథంలో జగన్నా«థునితోపాటు సోదరి సుభద్ర, సోదరుడు బాలభద్ర (బలరాముని) ప్రతిమలను ఊరేగిస్తారు.ఈ ఏడాది సోమవారం అంటే జూలై 12 ఉదయం 7:47 నుంచి మొదలైన ఉత్సవాన్ని 8:19 నిమిషాలకు ముగించారు.ఈ రథయాత్ర సౌభ్రతృత్వానికి, ఐక్యతకు చిహ్నాంగా నిర్వహిస్తారు.

Advertisement
Odisha Puri Jagannath Yatra Started From Today Onwards, Lord Krishna, Odisha ,

ఈ రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగే భక్తులకు అన్ని విధాల జగన్నా«థుని కృప, ఆశీర్వాదలు కలుగుతాయని భక్తుల నమ్మకం.డెల్టా వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో మరోవైపు థర్డ్‌ వేవ్‌ భయంతో పూరీలోని కేవలం కొన్ని ప్రాంతాల్లోనే రథయాత్రను చేపట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించిందిప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్వీటర్‌ వేదికగా భక్తులకు పూరీ రథయాత్ర శుభాకాంక్షలను తెలిపారు.

‘ అందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని, ఆ జగన్నాథుని కోరుతున్నట్లు జై జగన్నాథ్‌ అని నినదించారు మోడీ.

Odisha Puri Jagannath Yatra Started From Today Onwards, Lord Krishna, Odisha ,

రథయాత్ర ప్రాముఖ్యత

ఈ రథయాత్రలో భాగంగా జగన్నాథుని ప్రసిద్ధి చెందిన గుడిచా మాత దేవాలయానికి తీసుకెళ్తారు.అక్కడ స్వామివారు 7 రోజులపాటు విశ్రాంతి తీసుకుంటారు.తిరిగి జనన్నాథుడు పూరీకి టెంపుల్‌కు చేరుకునే సమయంలో జగన్నాథ యాత్రను దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

జగన్నాథుడు అంటేనే కృష్ణ భగవాణుడి మరో అవతారం.వందల మంది త్యాగ ఫలానికి ఈ రథయాత్ర సరిసమానమని నమ్ముతారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

భక్తులు ఈ యాత్రలో పాల్గొని రథాన్ని లాగితే అతడి దేవుడి ఆశీర్వాదం లభిస్తాయని నమ్ముతారు.ఈ యాత్రను పదిరోజుల పాటు నిర్వహిస్తారు.

Advertisement

ఈ రథాన్ని ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు నుంచి సిద్ధం చేస్తారు.

రథయాత్రకు ఏళ్ల చరిత్ర

ఏళ్ల చరిత్ర ఉన్న ఈ యాత్రకు బాలభద్రునితోపాటు జగన్నాథుడు, సుభద్ర కలిసి తన అత్తగారు ఉంటున్న గుడిచా టెంపుల్‌కు ప్రయాణిస్తారు.ఇది దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది.హిందూ ధర్మం ప్రకారం కేవలం ఈ రథయాత్రను చూస్తేనే పాపకర్మలన్ని పోతాయని అంటారు.

తాజా వార్తలు