Rajanna Sircilla : లింగన్నపేట పీహెచ్ సీకి ఎన్ క్వాస్ సర్టిఫికెట్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) గంభీరావుపేట మండలం లింగన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎన్ క్వాస్ సర్టిఫికెట్ శుక్రవారం లభించింది.

ఆ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కు ధ్రువపత్రo అందింది.

నేషనల్‌ హెల్త్‌ సిస్టమ్‌ రిసోర్స్‌ సెంటర్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్సీ) నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను చేరుకుంటే ఎన్‌ క్వాస్‌ సర్టిఫికెట్‌ వస్తుంది.దీనికి మూడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది.ఆసుపత్రి అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం రూ.3 లక్షల చొప్పున రూ.9 లక్షలు రానున్నాయి.తద్వారా మరింత మెరుగైన సేవలు అందనున్నాయి.

ఇప్పటికే 8 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు రాక.జిల్లాలోని 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు( Primary Health Centers ) ఇప్పటికే ఎన్ క్వాస్ సర్టిఫికెట్ లభించింది.కోనరావుపేట, తంగళ్ళపల్లి, బోయినిపల్లి, కొదురుపాక, సిరిసిల్ల పీఎస్ నగర్ అర్బన్, నేరెళ్ళ, విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎన్‌క్వాస్‌ సర్టిఫికెట్( NQAS Certificate ) లభించింది.

ఇటీవలే వేములవాడ ఏరియా ఆసుపత్రికి ఎన్ క్వాస్ సర్టిఫికెట్ లభించింది.ఫలితంగా మౌలిక వసతులు పెరిగాయి.

Advertisement

విలువైన వైద్య పరికరాలు అందుబాటులోకి వచ్చాయి, ఓపీ, ఐపీ, సర్జికల్‌ ఇలా అన్ని విభాగాల్లో నాణ్యత పెరిగింది.తక్కువ సమయంలోఎక్కువ ఆసుపత్రులు ఎన్ క్వాస్ సర్టిఫికెట్ చేజిక్కించుకున్న జిల్లాగా రాజన్న సిరిసిల్ల కు రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు లభించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న ఎన్‌క్వాస్‌ సర్టిఫికెట్ జిల్లాలోని 9 ఆరోగ్య కేంద్రాలకు రావడం పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కలెక్టర్ సంపూర్ణ సహకారం వల్లే కలెక్టర్ అనురాగ్ జయంతి( Collector Anurag Jayanthi ) సంపూర్ణ సహకారం, నిరంతర పర్యవేక్షణతో ఇప్పటి వరకూ జిల్లాలోని 7 పీహెచ్ సీ లకు, ఒక ఏరియా ఆసుపత్రికి ఎన్‌క్వాస్‌ లభించింది.

ఇప్పుడు లింగన్న పేటకు ఎన్‌క్వాస్‌ సర్టిఫికేట్ వచ్చింది.దీంతో దవాఖానలకు మూడేండ్ల లో ప్రభుత్వం నుంచి తొమ్మిది లక్షల రూపాయలు అదనంగా రానున్నాయి.

తద్వారా పేద ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందే సౌలభ్యం కలగనుందని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ రజిత అన్నారు.

ఘనంగా గాంధీ జయంతి వేడుకల నిర్వహణ
Advertisement

Latest Rajanna Sircilla News