ఏకశిలా నర్సింగ్ హోమ్ కి నోటీసులు జారీ:జిల్లా వైద్యాధికారి కోటా చలం

మూడు రోజుల క్రితం అబార్షన్ చేయడంతో ఓ మహిళ మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలతో గురువారం జిల్లా కేంద్రంలోని ఏకశిలా నర్సింగ్ హోంలో డిఎం అండ్ హెచ్ఓ కోటా చలం విచారణ చేపట్టి, మృతురాలకి అందించిన చికిత్స వివరాలను పరిశీలించారు.

వైద్యారోగ్య శాఖ నిబంధనలకు లోబడి ఆసుపత్రి నిర్వహణ లేదని గుర్తించి నోటీసులు అందించారు.

మూడు రోజులలో సమాధానం ఇవ్వాలని,సంతృప్తి కరమైన సమాధానం రాకపోతే తమ శాఖ నిబంధనల మేరకు ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిండం సరిగ్గా ఎదగని కేసుల్లో సైతం అబార్షన్ చేయాల్సి వస్తే అర్హులైన ఇద్దరు వైద్య నిపుణుల సలహా మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకుని అబార్షన్ చేయాల్సి ఉంటుందన్నారు.

అలా జరగని పక్షంలో సదరు వైద్యులు శిక్షార్హులు అవుతారని తెలిపారు.

డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement

Latest Suryapet News