పనిచేయని సీసీ కెమెరాలు- పట్టించుకోని గ్రామపంచాయతీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని గత మూడు సంవత్సరాల క్రితం గ్రామంలోని పురవీధులలో, బహిరంగ ప్రదేశాలలో సీసీ కెమెరాలు( CCTV cameras ) గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

గ్రామంలోని వివిధ కిరాణా షాపులలో మనిషికి 2 వేల చొప్పున వసూలు చేసి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

మూడు సంవత్సరాల నుండి గ్రామంలో సీసీ కెమెరాలు పనిచేస్తలేవని గ్రామస్తులు ఆందోళనల చెందుతున్నారు.పదవి కాలం ముగిసినప్పటికీ సీసీ కెమెరాలు మాత్రం పట్టించుకునే నాధుడు లేడని గ్రామస్తులు తెలుపుతున్నారు.

ఇప్పటికైనా గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రిపేరు చేసి తక్షణమే మరమ్మతు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా అందుబాటులోకి తేవాలని మల్యాల గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News