ప్రభుత్వ భూమి ఆక్రమణపై చర్యలేవీ...?

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామ పంచాయితీ, ముండ్లపహడ్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 103/20 లో 11 గుంటలు, సర్వే నెంబర్ 103/31లో 4 గుంటల ప్రభుత్వ భూమిని కొందరు అక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించి,గెస్ట్ హౌస్ గా మార్చుకొని, ప్రజలు నడిచే రహదారిని మూసి వేశారని ఆరోపిస్తూ మంగళవారం వేములపల్లి తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ కు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పల్లా వెంకటయ్య ఫిర్యాదు చేయడంతో భూ ఆక్రమణ బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఈ సందర్బంగా వెంకటయ్య మాట్లడుతూ ప్రభుత్వ భూమిని అక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లేని యెడల ఆక్రమణదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి,జిల్లా కలెక్టర్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

అద్భుతం, అడవి జంతువుకు దైవభక్తా.. శివలింగాన్ని హత్తుకున్న ఎలుగుబంటి వీడియో వైరల్!

Latest Nalgonda News