రోడ్డు ప్రమాదంలో నవ వదువు మృతి

సూర్యాపేట జిల్లా:రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం నరసారావుపేటకు చెందిన స్టేట్ బ్యాంక్ ఉద్యోగి సంఘాల శిరీష(33) సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన ఆమంచి జగదీశ్వర శర్మ కుమారుడు సాప్ట్ వేర్ ఉద్యోగి శ్రీనివాస్ తో మూడు నెలల క్రితం (మే 4న) వివాహం జరిపించారు.

సూర్యాపేటలో ఉద్యోగం చేసిన శిరీష భర్త ఉద్యోగ రీత్యా హైద్రాబాద్ కు బదిలీ చేయించుకున్నారు.ఆదివారం తమ సమీప బంధువుల వివాహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూచిపూడికి వెళ్లి తిరిగి వస్తుండగా తెల్లవారుజామున విజయవాడ సమీపంలో గుణదల రహదారిపై కారు అదుపుతప్పి డివైడర్ ను ఢి కొట్టిన ప్రమాదంలో నవ వధువు శిరీష అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

Newlywed Died In A Road Accident-రోడ్డు ప్రమాదంలో

దీనితో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇంటి పన్ను కట్టని ఇంటి ముందు మున్సిపల్ సిబ్బంది ధర్నా
Advertisement

Latest Suryapet News