పార్టీ జంపింగ్‌ల్లోనూ జ‌గ‌న్ ముద్ర‌.. వైసీపీలో కొత్త రాజ‌కీయం

ఏమాట‌కామాటే చెప్పుకోవాలి! చంద్ర‌బాబు చాలా సీనియ‌ర్‌.రాజకీయాల్లో కావొచ్చు.

వ‌య‌సు వ‌ల్ల కావొచ్చు.

ఆయ‌న చాలా సీనియ‌ర్‌.

ఆయ‌న‌కు ఆయ‌నే చెప్పుకొంటారు అని అనుకుంటాం కానీ, మ‌న‌మైనా ఒక్క‌సారి ఆయ‌న పొజిష‌న్‌లో ఉన్నామ‌ని ఊహిస్తే.మ‌న‌కు మాత్రం ప్ర‌చారం చేసుకోవాల‌ని ఉండ‌దా ?  కాబ‌ట్టి బాబును త‌ప్పుప‌ట్ట‌లేం.అయితే, ఆయ‌న క‌న్నాచాలా లేటుగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన జ‌గ‌న్‌.

పైకి ఎక్క‌డా బాబు లాగా న‌వ్వుతూ క‌నిపించ‌రు కూడా.పైగా ఆయ‌న ప్ర‌భుత్వం నిర్వ‌హించిన దాఖ‌లా లేదు.

Advertisement

ఇక‌, పార్టీ స్థాపన విష‌యంలోను, నిర్వ‌హ‌ణ విష‌యంలోనూ చంద్ర‌బాబు క‌న్నా కూడా జ‌గ‌న్ జూనియ‌రే.! అయితే, ఇద్ద‌రి మ‌ధ్య చాలా తేడానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పార్టీలో చంద్ర‌బాబుకు ప‌ట్టుక‌న్నా.కూడా సెంటిమెంటుతో ఆయ‌న నాయ‌కుల‌ను నిల‌బెట్టుకునేందుకు, కులాల ప‌రంగా పార్టీలో నేత‌ల‌పై ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తార‌నే వాద‌న ఉంది.

ఇక‌, జ‌గ‌న్ విష‌యంలో మాత్రం దీనికి భిన్న‌మైన వాద‌న ఉంది.ఆయ‌న ఒక మాట చెబితే.అంతే! అది జ‌రిగి తీరాల్సిందే.

ఎవ‌రైనా దానికి క‌ట్టుబ‌డాల్సిందే.కానీ, బాబు విష‌యంలో అలా లేదు.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?

ఈ నేప‌థ్యంలోనే బాబుకు తీవ్ర‌మైన ఇబ్బంది ఎదుర‌వుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.ఆయ‌న టీడీపీ అధినేత‌గా పార్టీలో నేత‌ల‌పై ప‌ట్టు కొన‌సాగించ‌లేక పోతున్నార‌ని తెలుస్తోంది.

Advertisement

రాజ‌కీయాల్లో ఇటీవ‌ల కాలంలో పార్టీలు మార‌డం.నేత‌ల‌కు సాధార‌ణంగా మారిపోయింది.వైసీపీ నుంచి టీడీపీలోకి టీడీపీ నుంచి వైసీపీలోకి మారుతున్న నేత‌ల‌కు కొద‌వ‌లేదు.

అయితే, ఈ సంద‌ర్భంగా పార్టీలు మారుతున్న నాయ‌కులు అధినేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం స‌హ‌జంగా పెట్టుకున్నారు.గ‌తంలో వైసీపీ నుంచి పార్టీ మారి టీడీపీలో చేరిన నాయ‌కులు జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేసేందుకు వెనుకాడేవారు.

అంతేకాదు, ఆయ‌న గురించి ఏం మాట్లాడం.చంద్ర‌బాబు అభివృద్ది చూసి పార్టీ మారాం అనేవారు.

కానీ, టీడీపీ నుంచి పార్టీ మారి.వైసీపీలోకి చేరుతున్న వారు మాత్రం చంద్ర‌బాబుపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

కులాల రాజకీయం చేశార‌ని, కొంద‌రినే ఆయ‌న ప్రోత్స‌హిస్తున్నార‌ని, త‌న కుల‌పోళ్ల‌కే అన్ని చేస్తున్నార‌ని.ఇలా అనేకానేక విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఇదీ జ‌గ‌న్‌కు, చంద్ర‌బాబుకు ఉన్న తేడా అని.ఇదే వైసీపీ కొత్త రాజ‌కీయం అని విశ్లేష‌కులు చెపుతున్నారు.

తాజా వార్తలు