హన్మాజీపేటలో ప్రవహిస్తున్న నక్కవాగు.. నిలిచిపోయిన రాకపోకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలోని నక్కవాగు రాత్రి కురిసిన భారీ వర్షానికి ధారాళంగా ప్రవహిస్తుంది.

అయితే ఇటీవల నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం సగం వరకు మాత్రమే పూర్తికావడంతో తాత్కాలికంగా మట్టితో వేసిన రోడ్డు వరద ఉధృతికి కొట్టుకుపోయింది.

దీంతో గ్రామంతో పాటు చుట్టూ పరిసర గ్రామాల ప్రజల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.వేములవాడ, సిరిసిల్లకు వెళ్లాలంటే లింగంపల్లి మీదుగా తమ వాహనాలను మళ్లిస్తున్నారు.

ఇప్పటికైనా అధికార యంత్రాంగం బ్రిడ్జి నిర్మాణాన్ని పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Advertisement

Latest Rajanna Sircilla News