మగ్గం శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేసిన: నాబార్డ్ డిడిఎం

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని 20 రోజులలో 60 మంది మహిళలు ఉచిత మగ్గం దిలీప్ చంద్ర సర్టిఫికెట్లను అందజేశారు.

మండల కేంద్రంలోని లైన్స్ క్లబ్ భవనంలో నాబార్డ్ డీడీఎం నాబార్డ్ సహకారంతో స్పందన సేవా సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత మగ్గం వర్క్ ట్రైనింగ్ గత ఫిబ్రవరి మాసంలో ప్రారంభించి 20 రోజులపాటు ఉచిత శిక్షణ 60 మంది మహిళలకు శిక్షణ పొందారు.

వారికి శుక్రవారం రోజు నాభార్డు డిస్టిక్ డెవలప్మెంట్ మేనేజర్ దిలీప్ చంద్ర చేతుల మీదుగా సర్టిఫికెట్ అండ్ స్టై పాండ్ చెక్కును అందించడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.

నాబార్డ్ మహిళల కోసం వారి యొక్క ఎదుగుదల, ఆర్థిక స్వలంబన కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తుందని, వాటిని వినియోగించుకోవాలని మహిళలతో అన్నారు.ఉచిత మగ్గం వర్క్ శిక్షణ ద్వారా మీరు నేర్చుకున్న పనిని పూర్తిస్థాయిలో మీకు ఉపయోగించుకోవాలని కోరారు.

నేర్చుకున్న వారికి మరలా ఒకసారి కూడా రెండు రోజుల ట్రైనింగ్ ఇవ్వడానికి మేము సహాయం చేస్తామని అన్నారు.మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలని వారు సూచించారు.

Advertisement

వారితోపాటు ఎంపీడీవో సత్తయ్య, ఆర్ఐ సంతోష్,సొసైటీ కోఆర్డినేటర్ గౌతమి టీచర్లు రేఖ ,భవాని మరియు 60 మంది మహిళలు పాల్గొనడం జరిగింది.కొత్తగా 30 మంది మహిళలకు ఉచిత మగ్గం వర్క్ ట్రైనింగ్ కూడా డిడిఎం చేతుల మీదుగా మరల ప్రారంభించారు.

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు
Advertisement

Latest Rajanna Sircilla News