భారతీయుడు-2( Indian-2 ) సినిమాను 2017లో అనౌన్స్ చేశారు.లైకా ప్రొడక్షన్స్( Lyca Productions ) నిర్మాణంలో ఈ సినిమా 2019లో పట్టాలెక్కింది.
శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్లో ప్రారంభమైన ఈ మూవీ 2024 లో పూర్తయింది.అంటే ఏకంగా ఐదేళ్ల సమయం పట్టింది.
ఈ మూవీని అంత ఇంట్రెస్టింగ్గా ఎవరూ తీయలేదు.దీన్ని పూర్తి చేయలేక పూర్తి చేసినట్లు జనాల మీదకు వదిలారు.భారతీయుడు-3 కూడా తీస్తామని చెబుతున్నారు కానీ భారతీయుడు 2 సినిమానే చాలా చెత్తగా ఉందని కొంతమంది అంటున్నారు.అలాంటిది దీనికి ఇంకొక సీక్వెల్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.
భారతీయుడు సినిమా 28 ఏళ్ల క్రితం వచ్చింది.ఆ సినిమాలో కమల్ హాసన్ ( Kamal Haasan )చాలా ముసలి వాడి లాగా కనిపించాడు.సీక్వెల్లో అంతకంటే ముసలివాడు అయిపోవాలి, కానీ శంకర్ మాత్రం కమల్ హాసన్ మరింత పవర్ఫుల్ గా మారాడు అన్నట్టుగా చూపించి ప్రేక్షకులకు షాకిచ్చాడు.కొంతమంది ప్రేక్షకులు నవ్వుకున్నారు కూడా.బేసిక్ సెన్స్ లేకుండా శంకర్ ఈ సినిమా ఎలా తీసాడని చాలామంది ప్రశ్నిస్తున్నారు.భారతీయుడు-3 సినిమాలో కమల్ హాసన్‌ను సూపర్ మ్యాన్‌గా చూపిస్తారా ఏంటి అని సెటైర్లు పేలుస్తున్నారు.
అయితే సినిమా ఏదైనా సరే ఎమోషనల్ సీన్లు ఉంటే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.భారతీయుడు-2లో అలాంటి ఎమోషనల్ సీన్లు ఒక్కటీ లేకపోవడం షాకింగ్ విషయం.భారతీయుడు సినిమాలో కూతురి గురించి కమల్ హాసన్ పడే మనోవేదన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది.శంకర్, మణిరత్నం ( Shankar, Mani Ratnam )ప్యూర్ తమిళ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతారు.
కానీ ఈసారి ఆ ప్యూర్ స్టోరీ మిస్ అయింది.
రకుల్, సిద్ధార్థ్, ప్రియా( Rakul, Siddharth, Priya ) ఈ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు.అనిరుధ్ మ్యూజిక్ అందించాడు కానీ అది ఏ ప్రేక్షకుడికి నచ్చలేదు.అవినీతి అనేది ఇప్పుడు మనదేశంలోనే కాకుండా ప్రతి ఒక్క చోట కూడా ఒక వ్యాధి లాగా వ్యాపించింది.
ప్రతి ఒక్కరూ అందిన కాడికి లంచాలు దోచేస్తున్నారు.ప్రజలు కూడా ఇది ఒక మామూలు విషయం లాగా చూస్తున్నారు.
అందుకే జీరో టాలరెన్స్ ట్యాగ్ లైన్‌తో వచ్చిన భారతీయుడు 2 ఇప్పటి ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.
28 ఏళ్ల క్రితం ప్రేక్షకులకు ఈ అవినీతి అంశం అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏమో కానీ ఇప్పుడు కాదు.పైగా ప్రజెంటేషన్ చాలా బోరింగ్ గా సాగింది.ఫస్ట్ పార్టులో పాటలు ఒకటే బాగున్నాయి మిగతా సన్నివేశాలు ఏవీ కనెక్ట్ కాలేదు.
తమిళనాడులోనే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా తక్కువగా వచ్చాయి.రెమ్యునరేషన్ మొత్తం ముందే ఇవ్వాలి అని కమల్ హాసన్ గొడవ పెట్టుకున్నాడు.
అప్పుడే ఈ సినిమాకి భారీ నష్టాలు వస్తాయి ఏమో అని ప్రేక్షకులు అనుమానపడ్డారు.ఇప్పుడు ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే అదే నిజమేమో అనిపిస్తుంది.
పూర్ కేరక్టరైజేషన్, పూర్ ప్రజెంటేషన్, కథ కొత్తగా లేకపోవడం వల్ల ఈ సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉందని క్రిటిక్స్ కామెంట్లు చేస్తున్నారు.దర్శకుడు శంకర్ నుంచి ఇలాంటి చెత్త సినిమా రావడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
థర్డ్ పార్ట్ తీయకండి అని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు.