టీబీపై అవగాహన కలిగి ఉండాలి

సూర్యాపేట జిల్లా:టీబిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి,నియంత్రణలో భాగస్వాములు కావాలని డాక్టర్ బంకా వీరేంద్రనాథ్ తెలిపారు.

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండల పరిధిలోని కందగట్ల గ్రామంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు టీబీ నియంత్రణ గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్గ్యాతిధిగా హాజరై గతంలో టీబీ వచ్చిన రోగులకు మరియు ప్రస్తుతం టీబీతో ఇబ్బంది పడే రోగులకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడే రోగులకు,షుగర్,బీపీ వ్యాధిగ్రస్తుల నియంత్రణకు సంబంధించిన సలహాలు సూచనలు చేశారు.

రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం ఉన్నట్లయితే వారు తక్షణమే సంబంధిత ప్రభుత్వ హాస్పిటల్లో టీబీ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల అధికారి డాక్టర్ మురళీకృష్ణ,సూపర్వైజర్ శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ రేవతి,ఏఎన్ఎంలు సుజాత, అరుణ,ఆశ కార్యకర్తలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News