Mudragada Padmanabham : వైఎస్ఆర్ సీపీలోకి ముద్రగడ ఎంట్రీ.. జగన్‎తోనే కాపులకు ప్రయోజనాలు..!!

కాపు ఉద్యమనేత అనగానే మొదటగా గుర్తుకు వచ్చే పేరు ‘ ముద్రగడ పద్మనాభం’.( Mudragada Padmanabham ) వారసత్వ ఆస్థితో పాటు వందల ఎకరాల భూమిని కులం కోసం ఖర్చు చేసిన వ్యక్తి.

 Mudragadas Entry Into Ysr Cp Benefits For Kapus With Jagan-TeluguStop.com

ఎన్నో ఏళ్లుగా కాపు ఉద్యమాన్ని మోయడమే కాకుండా విలువల కోసం ప్రాణమైన ఇచ్చే తత్వం ఆయనదని చెప్పుకోవచ్చు.కాపు ఉద్యమం కోసం పదవులు సైతం త్యాగం చేశారన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

తాజాగా ముద్రగడ వైఎస్ఆర్ సీపీలో( YSRCP ) చేరారు.దీంతో రాష్ట్రంలోని కాపులకు ప్రయోజనాలు చేకూరనున్నాయి.

త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అధికార వైసీపీతో పాటు విపక్ష కూటమి పార్టీలు గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాయి.

ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్( CM Jagan ) సమక్షంలో వైఎస్ఆర్ సీపీలో చేరారు.వీరి చేరికతో రాజకీయ వర్గాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

స్వప్రయోజనాలను పక్కన పెట్టి కాపు సంక్షేమం కోసం పాటుపడిన ముద్రగడ.అనేక పదవులను త్యాగం చేశారు.

ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీలో( TDP ) ఉన్న సమయంలో మంత్రి పదవిని సైతం వదులుకున్నారు.కాపు ఉద్యమ సమయంలో ముద్రగడతో పాటు ఆయన కుటుంబ సభ్యులను అప్పటి టీడీపీ ప్రభుత్వం అవమానించడం సంచలనంగా మారింది.

చంద్రబాబు( Chandrababu Naidu ) కావాలనే ముద్రగడను పోలీసులతో అరెస్ట్ చేయించారన్న వాదనలు కూడా వచ్చాయి.దీంతో కాపుల్లో చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.

Telugu Ap, Benefits Kapus, Chandrababu, Cm Ys Jagan, Kapumudragada, Kapunestham,

కొన్ని రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ.ఈ మధ్య కాలంలో జనసేన పార్టీలో( Janasena ) చేరతారనే ప్రచారం జోరుగా సాగింది.అయితే కుల రాజకీయాల నేపథ్యంలో పొత్తులో ఉన్న చంద్రబాబు ముద్రగడ చేరికను అడ్డుకున్నారని, దీని అంతటికీ నాదెండ్ల మనోహార్ సహకరించారని కొందరు బహిర్గతంగానే చెబుతున్నారని తెలుస్తోంది.ఆ తరువాత తాడేపల్లిగూడెంలో టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కాపు ఉద్యమ నేతలైన ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామ జోగయ్యలపై పరోక్ష విమర్శలు చేశారు.

దీంతో కాపుల్లో టీడీపీ -జనసేన మీద వ్యతిరేకత మరింత ముదిరింది.

Telugu Ap, Benefits Kapus, Chandrababu, Cm Ys Jagan, Kapumudragada, Kapunestham,

అయితే మొదటి నుంచి అన్ని వర్గాల నేతలకు, ప్రజలకు వైఎస్ఆర్ సీపీ సమ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాదు రాష్ట్రంలోని కాపులకు వైఎస్ఆర్ సీపీ, సీఎం వైఎస్ జగన్ వెన్నుదన్నుగా నిలిచారు.కాగా ఉభయగోదావరి జిల్లాలో కాపులు అధికంగా ఉన్నారు.

ఉమ్మడి జిల్లాలోని దాదాపు 34 స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండగా.ప్రస్తుతం ముద్రగడ చేరికతో వైఎస్ఆర్ సీపీకి మరింత బలం చేకూరింది.

Telugu Ap, Benefits Kapus, Chandrababu, Cm Ys Jagan, Kapumudragada, Kapunestham,

పాదయాత్ర సమయంలోనే కాపులకు రిజర్వేషన్( Kapu Reservation ) ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని చెప్పినప్పటికీ.సీఎం వైఎస్ కాపు సామాజికవర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ‘ కాపు నేస్తం’ పథకం ద్వారా చేయూత ఇచ్చారు.అంతేకాదు రెండు ఎంపీ స్థానాలతో పాటు 19 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలను కాపు అభ్యర్థులకు కేటాయించారు సీఎం వైఎస్ జగన్.కాపు నేస్తం ద్వారా మహిళలకు సైతం ఆర్థికసాయం చేసి అండగా నిలిచారు.

అయితే కాపు నేతలుగా ఉన్న హరిరామ జోగయ్య, ముద్రగడ వంటి నేతలను జనసేనలోకి వెళ్లకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని ప్రజలు భావిస్తున్నారు.కేవలం తన కుట్రలు బయటపడతాయనే వీరి చేరికను అడ్డుకున్నారని తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం కాపులకు ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముద్రగడ చేరికతో పార్టీకి బలం పెరిగిందని చెప్పుకోవచ్చు.రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి ప్రయోజనాలు చేకూరాలంటే కేవలం వైఎస్ఆర్ సీపీతోనే సాధ్యమని స్పష్టం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube