ఎమ్మార్పీఎస్ సడక్ బంద్

బీజేపీ మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.హైదరాబాద్ కార్యవర్గ సమావేశాలల్లో తీర్మానం చేసి ప్రకటించాలి.

లేదంటే మాదిగలు బీజేపీని క్షమించరు.సడక్ బంద్ చేస్తున్న ఎమ్మార్పీఎస్ నేతల అరెస్ట్.

MMRPS Sadak Bandh-ఎమ్మార్పీఎస్ సడక్ బంద్

సూర్యాపేట జిల్లా:ఎస్సీ వర్గీకరణపై బీజేపీ మాదిగలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటే వెంటనే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్,ఎమ్ఎస్పీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న డిమాండ్ చేశారు.శనివారం తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్న మోసపూరిత,నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సడక్ బందు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేయాలని,హైదరాబాద్ లో జరిగే బీజేపీ పార్టీ బహిరంగ సభలో కీలక నేతలు ఎస్సీ వర్గీకరణపై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.ఎస్సీ వర్గీకరణపై మాదిగలను విస్మరించి మోసం చేయాలని చూస్తే తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలుకంటున్న బిజెపికి ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు.

Advertisement

అనంతరం శాంతియుతంగా సడక్ బంద్ ను నిర్వహిస్తున్న ఎమ్మార్పీఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈఅక్రమ అరెస్టులను ఖండిస్తూ పలు ప్రజాసంఘాల,బీసీ ఉద్యమ నేతలు కొత్తగట్టు మల్లయ్య,సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కడెం లింగయ్య,సీపీఎం పార్టీ మండల కార్యదర్శి పోరెళ్ల లక్ష్మయ్య,బీసీ సంక్షేమ సంఘం మండల కన్వీనర్ రామ్ ప్రభు,బీసీ సంక్షేమ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు పతేపురం యాదగిరి,జాంబవ పౌండెషన్ కందుకూరి శ్రీనివాస్, తమ సంఘీభావాన్ని ప్రకటించి ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయిన వారిని కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పాల్వాయి బాలయ్య మాదిగ,ఎంఎస్పీ తుంగతుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ కందుకూరి శ్రీను మాదిగ,ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా కమిటీ నాయకులు కందుకూరి విశ్వేశ్వర్ రాంపాక, సత్తయ్య,బోండ్ల వంశీ,దంతాలపల్లి యాకన్న, సోమన్న,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News