ఈ ఎన్ఆర్ఐ లకు ఎమ్మెల్యే టికెట్ ఖరారు...?

సూర్యాపేట జిల్లా:అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ హోదాలో కెటీఆర్ కొంతమంది ఎన్ఆర్ఐ లకు టికెట్ లు అనౌన్స్ చేసినట్లు సమాచారం.తెలంగాణ రాజకీయాల్లో పట్టు కోసం 2014,2018 ఎన్నికల్లో కెసీఅర్ ఎమ్మెల్యే టికెట్లు కేటాయించి విజయం సాధించారు.

2023 ఎలక్షన్ల విషయంలో కొన్ని టికెట్ల విషయంలో కేటీఆర్ కు కొంత ఫ్రీడం ఇవ్వటంతో తనకు అనుకూలంగా ఉండి,పూర్తి విశ్వాసంతో ఉండే కొంతమంది ఎన్ఆర్ఐ లకు టికెట్ లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.ఈ ఎన్ఆర్ఐ కోటాలో బలంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి.

MLA Ticket Has Been Finalized For These NRIs, MLA Ticket , NRIs, Brs Party, Mini

ఖానాపూర్ నుండి జాన్సన్ రాథోడ్ నాయక్,కోదాడ నుండి జలగం సుధీర్ లకు దాదాపు టికెట్ ఖరారు అయినట్టెనని కెటీఆర్ సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తుంది.వీరిద్దరూ ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ లలో తమదైన శైలీలో ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.

ఎన్ఆర్ఐ లు అంటే కేవలం ఎలక్షన్ల ముందు వస్తారని కాకుండా ప్రజలతో మమేకమై పార్టీ ఇమేజ్ పెంచే అనే కార్యక్రమాలు గత కొన్నెండ్లుగా చేస్తుండటంతో ప్రజల నుండి,సర్వేల్లో కూడా వీరి పట్ల సానుకూల వాతావరణం ఉన్నట్లు గురించే ఆ దిశగా పావులు కదుపుతున్నారని తెలుస్తుంది.పనిలో పనిగా హుజురాబాద్ నుండి కౌశిక్ రెడ్డి,కరీంనగర్ పార్లమెంట్ నుండి బోయినపల్లి వినోద్ కుమార్ లను గెలిపించాలని అక్కడ మీటింగ్ లలో ప్రజలకు పిలుపునివ్వడం కొసమెరుపు.

Advertisement

Latest Suryapet News